Gold Price Today: క్రమంగా తగ్గుతోన్న బంగారం ధర.. శనివారం గోల్డ్ రేట్ ఎలా ఉందంటే..
శుభకార్యక్రమాలు లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు రూ. 80 వేలకు చేరువైన తులం బంగారం ధర ఏకంగా రూ. 10 వేలు తగ్గడం గమనార్హం. తాజాగా శనివారం కూడా బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం...
శుభకార్యక్రమాలు లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు రూ. 80 వేలకు చేరువైన తులం బంగారం ధర ఏకంగా రూ. 10 వేలు తగ్గడం గమనార్హం. తాజాగా శనివారం కూడా బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,890కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 71,880 వద్ద కొనసాగుతోంది. మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,040గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,030 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 65,890కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,880 వద్ద కొనసాగుతోంది.
* చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,490గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ఊ. 72,540 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 65,890గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,880గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,890గా ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 71,880 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 65,890గా ఉండగా, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 71,880గా ఉంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 65,890 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,880గా ఉంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
వెండి కూడా బంగారం బాటలోనే పయణిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబయి, కోల్‌కతా, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 90,400 వద్ద కొనసాగుతుండగా, హైదరాబాద్, చెన్నై, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 64,900 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..