Onion Price: కొనకుండానే కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. అప్పటి వరకు పరిస్థితి ఇంతే..

దేశంలో ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ఉల్లి ధరలు.. కొనే ముందే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఉల్లి సరఫరా తక్కువగా ఉండటమేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఉల్లిని ఉత్పత్తి చేసే అగ్ర గామి రాష్ట్రమైన మహారాష్ట్రలో కరువు పరిస్థితుల కారణంగా ఉత్పత్తిలో లోటు ఉందని చెబుతున్నారు. దీంతో దేశంలో గత రెండు వారాలలో ఉల్లి ధరలు 30 నుంచి 50 శాతం పెరిగాయి.

Onions
Follow us
Ashok Bheemanapalli

| Edited By: Srikar T

Updated on: Jun 15, 2024 | 7:12 AM

దేశంలో ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ఉల్లి ధరలు.. కొనే ముందే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఉల్లి సరఫరా తక్కువగా ఉండటమేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఉల్లిని ఉత్పత్తి చేసే అగ్ర గామి రాష్ట్రమైన మహారాష్ట్రలో కరువు పరిస్థితుల కారణంగా ఉత్పత్తిలో లోటు ఉందని చెబుతున్నారు. దీంతో దేశంలో గత రెండు వారాలలో ఉల్లి ధరలు 30 నుంచి 50 శాతం పెరిగాయి.

ఈ క్రమంలోనే కొందరు వ్యాపారులు ఉల్లిని నిల్వ చేసి.. ధరలు మరింతగా పెరిగేలా చేస్తున్నారని, అలా ధరలు పెరిగిన తర్వాత అమ్ముకోవాలని చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. హైదరాబాద్‌లో ఉల్లిపాయల ధరల విషయానికి వస్తే.. రిటైల్ ధర సుమారు 25 శాతం, హోల్‌సేల్ ధర 15 శాతం పెరిగింది. ఏడాది క్రితం ఉల్లి రిటైల్‌ ధరలు కిలో రూ. 20 ఉండగా.. హోల్‌ సేల్‌ ధర క్వింటాల్‌కు రూ. 1,581.97 గా ఉంది. ప్రస్తుతం రిటైల్ ధరలు కిలోకు రూ. 40 నుంచి రూ. 50 మధ్య ఉంది. ఒక నెల క్రితం ఉల్లి కిలో ధర రూ. 20 నుంచి రూ. 30 వరకు ఉంది. నెల రోజుల వ్యవధిలోనే ఉల్లి ధరలు భారీగా పెరిగాయి.

అయితే, జూన్ 17న బక్రీద్‌ నేపథ్యంలో ఉల్లిపాయలకు దేశీయంగా భారీ డిమాండ్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు.. సెప్టెంబరు, అక్టోబరు వరకు కొత్త ఖరీఫ్ పంట చేతికి వచ్చే అవకాశం లేక పోవడంతో ఉల్లి కిలో రూ. 50 నుంచి రూ. 60 దాట వచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక, దేశంలోని ఉల్లిలో 42 శాతానికిపైగా ఉత్పత్తి చేసే మహారాష్ట్ర.. తీవ్రమైన కరువు పరిస్థితుల కారణంగా ఉత్పత్తిలో 15 నుంచి 20 శాతం తగ్గుదలని చవి చూసింది. మహారాష్ట్రలోని 27 జిల్లాలలో 20 నుంచి 45 శాతం వరకు లోటు వర్షపాతాన్ని ఎదుర్కొన్నాయని గణంకాలు సూచిస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

HMPV: భారత్‌లో తొలి HMPV కేసు.. 8 నెలల చిన్నారికి

తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్

భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ

సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి

డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన

మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..

ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు

పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..

చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు

పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం