ఆ నియోజకవర్గంపై సీఎం చంద్రబాబు ఫోకస్.. 2రోజుల పర్యటన అందుకేనా.?
కోపం ఉంటే నాపై చూపండి.. కుప్పంపై వివక్ష మాత్రం వద్దు. ఇది గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. అయితే ఇప్పుడు మళ్ళీ సీఎం కావడంతో కుప్పం అభివృద్ధిపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. గత 5 ఏళ్లలో కుంటుపడ్డ కుప్పం అభివృద్ధిపై దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు పెండింగ్ ప్రాజెక్టులను పట్టాలెక్కించడమే కాదు.. హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు కుప్పంకు తీసుకొచ్చేందుకు పక్కా ప్రణాళికలతో ఉన్నారు.
కోపం ఉంటే నాపై చూపండి.. కుప్పంపై వివక్ష మాత్రం వద్దు. ఇది గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. అయితే ఇప్పుడు మళ్ళీ సీఎం కావడంతో కుప్పం అభివృద్ధిపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. గత 5 ఏళ్లలో కుంటుపడ్డ కుప్పం అభివృద్ధిపై దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు పెండింగ్ ప్రాజెక్టులను పట్టాలెక్కించడమే కాదు.. హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు కుప్పంకు తీసుకొచ్చేందుకు పక్కా ప్రణాళికలతో ఉన్నారు. ఇందులో భాగంగానే సీఎం అయ్యాక తొలిసారి సొంత నియోజకవర్గ పర్యటనకు సిద్ధం అయ్యారు.
ఏపీ అసెంబ్లీలో చిట్ట చివరి నియోజకవర్గం కుప్పం. 1989 వరకు బాగా వెనుకబడినప్పటికీ.. సీఎం చంద్రబాబు వరుస విజయాలతో ఆ ప్రాంత అభివృద్ధి దశ తిరిగింది. కుప్పం నుంచి వరుసగా 8వ సారి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు 4వ సారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సీఎంగా చంద్రబాబు ఉన్నంత కాలం ప్రతి ప్రాజెక్టు, స్కీం ను ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు కుప్పం వేదిక అవుతూ వచ్చింది. సీఎం చంద్రబాబు కూడా సొంత నియోజకవర్గానికి హై ప్రియారిటీ ఇస్తూ వచ్చారు. అయితే 2019లో అధికారాన్ని కోల్పోయిన చంద్రబాబు ప్రతిపక్ష నేతగా కుప్పం అభివృద్ధిని చూడలేక పోయారు. కుప్పం ప్రజలకు ఇచ్చిన హామీలు తీర్చలేకపోయారు. ఇందుకు కుప్పంపై వైసీపీ ప్రభుత్వం వివక్షనే కారణమంటూ ఐదేళ్లుగా ఆరోపిస్తూ వచ్చారు. చంద్రబాబు సొంత ఇలాకాలో ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు.. పలు ప్రాజెక్టులను పూర్తి చేయడమే టార్గెట్‌గా చేసుకోబోతున్నారు. హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను కుప్పంకు తీసుకొచ్చేందుకు బ్రాంచ్ కెనాల్ నిర్మాణ పనులను చేపట్టి దాదాపు 85 శాతం వరకు పనులను పూర్తి చేశారు. అయితే ఈలోపు అధికారం చంద్రబాబు చేజారి పోగా వైసీపీ సర్కార్ హంద్రీనీవాను పూర్తి చేయలేక పోయింది. అయితే కుప్పంకు హంద్రీనీవా నీటిని తీసుకొచ్చామని చెప్పే ప్రయత్నం వైసీపీ చేసిందని టిడిపి ఆరోపించింది.
ఎన్నికలకు ముందు హంద్రీనీవా నీటిని కుప్పంకు విడుదల చేస్తున్నట్లు హడావిడి చేసినా నీళ్లు మాత్రం కుప్పంకు రాకపోవడంతో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ చంద్రబాబు సర్కార్‌కు అత్యంత ముఖ్యం అయింది. దీంతో గత ఐదేళ్లుగా హంద్రీనీవా కాలువ నిర్మాణ పనులను స్వయంగా పరిశీలిస్తూ వచ్చారు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు. హంద్రీనీవాను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. ఇక రామకుప్పం మండలం ననియాల వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టును చేపట్టిన సీఎం చంద్రబాబు 2019 నాటికి దాదాపు పూర్తి చేశారు. అయితే గత 5 ఏళ్లలో టూరిజం పర్యాటకులకు అందుబాటులోకి రాకపోగా ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత దాన్ని తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దులో ఎకో టూరిజం ప్రాజెక్టును పూర్తి చేసి పర్యాటక రంగ అభివృద్ధి సాధించాలని సీఎం చంద్రబాబు భావించారు. శిక్షణ పొందిన ఏనుగులున్న ననియాల ఎలిఫెంట్ క్యాంప్‌లో పర్యాటకులను ఆకట్టుకునేలా అంబారీ స్వారీ, విలాసవంతమైన కాటేజీలు, రిసార్ట్లు, హెలిప్యాడ్ నిర్మాణాలను పూర్తి చేశారు. అయితే ఆ ప్రాజెక్టు గత ఐదేళ్లపాటు నిరుపేయంగానే ఉండి పోవడంతో ఇప్పుడు సీఎం చంద్రబాబు కుప్పం అభివృద్ధిపై చేస్తున్నారు.
మరోవైపు కుప్పంలో రహదారుల విస్తరణ, పాలార్ ప్రాజెక్టు కీలకంగా మారింది. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల మధ్య గత కొన్ని దశాబ్దాలుగా అంతరాష్ట్ర సమస్యగా మారిన పాలారు ప్రాజెక్టు పనులకు గత ప్రభుత్వం పాలన అనుమతులను ఇచ్చింది. దాదాపు రూ.140 కోట్లు నిధులు విడుదలకు అనుమతించింది. అయితే పనులు మాత్రం చేపట్టక పొగా కుప్పం మండలం గణేష్ పురం వద్ద పాలారు ప్రాజెక్ట్ పనులు చేపట్టి పూర్తి చేయడం ఇప్పుడు టిడిపి సర్కార్ వంతు అయింది. కుప్పం – బెంగళూరు మధ్య కనెక్టివిటీ పెంచి శాటిలైట్ సిటీగా మార్చే దిశగా ప్రణాళిక రూపొందించారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు తొలి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు రామకుప్ప మండలంలో ఏయిర్ పోర్ట్ నిర్మాణానికి భూసేకరణ జరిపినా 2019లో రాష్ట్రంలో అధికారం మారిపోవడంతో ఆ పనులు ముందుకు జరగలేదు. అయితే ఇప్పుడు తిరిగి చంద్రబాబు సీఎం కావడంతో రామకుప్పం శాంతిపురం మండలాల మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులకు లైన్ క్లియర్ అయ్యిందని భావిస్తున్నారు స్థానికులు. ఈ మేరకు త్వరలో నిర్మాణ పనులు కూడా షురూ కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈనెల 25, 26 రెండు రోజులు సీఎంగా చంద్రబాబు కుప్పం పర్యటన చేపట్టబోతున్నారు. ఒక వైపు అభివృద్ధి పనులకే కాకుండా పార్టీ బలోపేతం పట్ల చంద్రబాబు ఫోకస్ పెడుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీ టార్గెట్‌గా పెట్టుకున్న చంద్రబాబుకు ఎందుకంత మెజార్టీ రాలేకపోయిందో అన్నదానిపై కూడా ఫోకస్ చేయబోతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..