Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala News: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరలపై క్లారిటీ ఇచ్చిన టీటీడీ

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరలను సవరించినట్లు పలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీడీపీ) క్లారిటీ ఇచ్చింది. పలు సామాజిక మాధ్యమాలలో శ్రీవారి లడ్డు ధరలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం ధరల్లో మార్పులు చేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని టీటీడీ స్పష్టంచేసింది.  

Tirumala News: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరలపై క్లారిటీ ఇచ్చిన టీటీడీ
Tirumala Laddu
Follow us
Janardhan Veluru

|

Updated on: Jun 22, 2024 | 5:03 PM

తిరుమల: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరలను సవరించినట్లు పలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీడీపీ) క్లారిటీ ఇచ్చింది. పలు సామాజిక మాధ్యమాలలో శ్రీవారి లడ్డు ధరలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం ధరల్లో మార్పులు చేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని టీటీడీ స్పష్టంచేసింది.  శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, రూ. 50 లడ్డూ ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని టీటీడీ స్పష్టం చేసింది. ఈ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని  టీటీడీ శనివారంనాడు (జూన్కో 22న) విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో కోరింది.

ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం దళారులను సంప్రదించొద్దు – భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

ఈ రోజు కొన్ని వాట్స్అప్ గ్రూపులలో తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొంద వచ్చునని కొంతమంది వారి ఫోన్ నంబర్లతో కూడిన సమాచారం సర్కులేట్ అవుతుండటం తమ దృష్టికి వచ్చినట్లు టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. వాస్తవానికి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు కొంత టికెట్ల కేటాయింపు జరిగినట్లు తెలిపింది. భక్తులు ఎవరైనా సంబంధిత టూరిజం ద్వారా ఈ టిక్కెట్లను పొందే సౌకర్యం ఉన్నదని వివరించింది. టూరిజం ద్వారా రావాలి అనుకొనే భక్తులు, దళారీ ల ద్వారా కాకుండా, నేరుగా, రాష్ట్ర టూరిజం వెబ్సైట్ ద్వారా కూడా దర్శనం ప్యాకేజీ టికెట్స్ పొందే అవకాశం ఉందని గమనించాలని కోరింది.

అయితే కొందరు దళారులు అమాయకులను తాము సదరు టూరిజం వెబ్సైట్ ద్వారా మీకు టిక్కెట్లు బుక్ చేసి ఇస్తామని ఇందుకుగాను ధర ఎక్కువ అవుతుందని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు టీటీడీ తెలిపింది. అలాంటి ప్రచారాన్ని భక్తులు నమ్మొద్దని.. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోసం దళారులను సంప్రదించొద్దని కోరింది.

ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్ లో అమాయకులైన భక్తులను మోసగిస్తున్న దళారులపై టిటిడి విజిలెన్స్ విభాగము కఠిన చర్యలు తీసుకుంటుందని టీటీడీ హెచ్చరించింది. ఈ విషయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని.. దళారుల మాటి నమ్మి మోసపోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది.