AP Assembly: సభలో 88 మంది కొత్త ఎమ్మెల్యేలు.. ఎలా ఉండాలో చెప్పిన స్పీకర్ అయ్యన్న..
సభాపతిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ సభ్యులకు పేరుపేరునా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ధన్యవాదాలు తెలిపారు. సభాపతి స్థానం చాలా పవిత్రమైనదన్నారు. అసెంబ్లీలోని సభ్యులు తనకు పదవి ఇవ్వలేదని ఒక బాధ్యత ఇచ్చారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.1983లో ఎన్టీఆర్తో పనిచేశాను. ఒక తూఫాను లాగా ప్రభుత్వ ఏర్పాడిందన్నారు.
సభాపతిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ సభ్యులకు పేరుపేరునా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ధన్యవాదాలు తెలిపారు. సభాపతి స్థానం చాలా పవిత్రమైనదన్నారు. అసెంబ్లీలోని సభ్యులు తనకు పదవి ఇవ్వలేదని ఒక బాధ్యత ఇచ్చారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.1983లో ఎన్టీఆర్తో పనిచేశాను. ఒక తూఫాను లాగా ప్రభుత్వ ఏర్పాడిందన్నారు. అయితే అప్పుడు మెజార్టీ సీట్లు వచ్చాయి కానీ.. ఈ స్థాయిలో మెజార్టీలు రాలేదని గత అనుభవాన్ని గుర్తు చేశారు. శాసనసభలో మాట్లాడటమంటే ప్రజల కోసమే మాట్లాడాలన్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం అంటే సామాన్య విషయం కాదన్నారు. 88 మందికిపైగా కొత్తగా శాసనసభకు ఎన్నికయ్యారని గుర్తు చేశారు.
మీరందరూ ప్రజల తరఫున తమ గళాన్ని ఈ సభలో వినిపించాలని కోరారు. సభలో ప్రశ్నలు ఎలా అడగాలో సభ్యులు తెలుసుకోవాలని సూచించారు. సీనియర్ల సలహాలు తీసుకొని నియోజకవర్గ అభివృద్ధికి నూతన ఎమ్మెల్యేలు కృషి చేయాలని అభిప్రాయపడ్డారు. ఐదు సంవత్సరాల పదవి మనకి పండగ కాదు బాధ్యత అని చెప్పారు. గతంలో నూతనంగా ఎన్నికైన సభ్యులకు ట్రైనింగ్స్ ఇచ్చేవారని.. ఇప్పుడు కూడా కొత్తగా ఎన్నికైన సభ్యులకు ట్రైనింగ్ ఇద్దామన్నారు.సభలో స్పీకర్ తక్కువగా మాట్లాడాలి.. సభ్యులు ఎక్కువగా మాట్లాడాలన్నారు.16వ శాసనసభకు మంచి గుర్తింపు, గౌరవం వచ్చే విధంగా అందరి సభ్యులు సహకరించాలని కోరారు. సభలో అందరికీ మాట్లాడే అవకాశం, సమయం ఇస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం కష్టపడి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..