Watch Video: క్యాన్సర్‌తో బాధపడుతున్న కార్యకర్తకు సీఎం చంద్రబాబు వీడియో కాల్.. నేనున్నా ధైర్యంగా ఉండాలని భరోసా!
తన పార్టీ కార్యకర్తలపై ఉన్న ప్రేమని, కార్యకర్తలు తన కుటుంబ సభ్యులే అనే భావనను టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు మరోసారి నిజం చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్న, రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన ఆకుల కృష్ణ అనే కార్యకర్తకు క్యాన్సర్ నిర్ధారణ కావడం, ఆరోగ్యం క్షీణించడంతో ముఖ్యమంత్రిని ఒక్కసారైనా చూడాలనే అతని ఆకాంక్షను చంద్రబాబు నెరవేర్చారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న టీడీపీ కార్యకర్తల ఆకుల కృష్ణతో సీఎం చంద్రబాబు వీడియో కాల్‌లో మాట్లాడారు.

రాజమండ్రి రూరల్ నియోజకవర్గం మోరంపూడి జంక్షన్‌కు చెందిన ఆకుల కృష్ణ చిన్ననాటి నుంచి టీడీపీ అభిమాని. టీడీపీ జెండా ఎగరవేయడం నుంచి, ప్రతి ఎన్నికలో పార్టీ అభ్యర్థులకు కార్యకర్తలుగా మద్దతు ఇవ్వడం వరకూ ఆయన పాత్ర విశేషం. అంతేకాదు, ఇయను చంద్రబాబు అంటే అమితమైన ఇష్టం, అయితే, ఇటీవల క్యాన్సర్ వ్యాధికి గురైన కృష్ణ ఆనారోగ్యంతో బాధపడుతున్నారు.. రోజురోజుకూ ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది. ఈ క్రమంలో తన మనసులో ఉన్న ఓ కోరికను ఆయన తన కుటుంబ సభ్యులతో పంచుకున్నాడు. తన ప్రియ నాయకుడు సీఎం చంద్రబాబుతో ఒక్కసారైనా మాట్లాడాలని ఉందని కుటుంబసభ్యులకు తెలిపాడు.
ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు శనివారం సాయంత్రం స్వయంగా తానే ఆకుల కృష్ణకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. చంద్రబాబు కృష్ణను ఆత్మీయంగా పలకరించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండండి కృష్ణా.. మీరు ఒంటరివారు కాదు , మీ వెనుకా, మీ కుటుంబానికి నా పూర్తి మద్దతు ఉంది” అని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో సరిగ్గా మాట్లాడలేని స్థితిలో ఉన్న కృష్ణ.. స్వయంగా చంద్రబాబు ఫోన్ చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. తనకు ఇప్పుడు ఎంతో సంతృప్తిగా ఉందని కుటుంబసభ్యులకు చెప్పి భావోద్వేగానికి గురయ్యాడు.
వీడియో చూడండి..
W మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.