Weather Alert: ఇక నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
నైరుతి రుతుపవనాలు విస్తరించడంతోపాటు.. బంగాళాఖాతంలో ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.. రాగల రెండు, మూడు రోజులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

నైరుతి రుతుపవనాలు విస్తరించడంతోపాటు.. బంగాళాఖాతంలో ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.. రాగల రెండు, మూడు రోజులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి ఉత్తర గుజరాత్, ఉత్తర మధ్యప్రదేశ్, ఆగ్నేయ ఉత్తర ప్రదేశ్, ఝార్ఖండ్ మీదుగా గ్యాంగ్టిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్రమట్టం నుండి 3.1- 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగాల రెండు, మూడు రోజులు తెలంగాణ లోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో.. ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది..
తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
ఆదివారం తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీ వెదర్ రిపోర్ట్..
ఏపీలోని పలు చోట్ల ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య అరేబియా సముద్రం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించింది. ఇప్పుడు ఉత్తర గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని గంగా తీరంలోని ఉత్తర ప్రాంతాలు మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది.. అయితే.. ద్రోణి ప్రభావంతో.. ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 -50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది.
ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నన్నూరు, బాపట్ల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..