Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు సచివాలయ ఉద్యోగుల కేటాయింపు!

అమరావతి కేంద్రంగా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ను ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారు. ఐదేళ్లలో 20,000 స్టార్ట్‌ప్‌లతో 1000 కోట్ల పెట్టుబడి, 1 లక్ష ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పెద్ద సంస్థల భాగస్వామ్యంతో కార్యాచరణ చేపట్టారు. అందులో భాగంగా అమరావతి కేంద్రంగా ఏర్పాటయ్యే సెంట్రల్ హబ్‌కు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగలును డిప్యూట్‌ చేయాలని జిల్లాల కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు సచివాలయ ఉద్యోగుల కేటాయింపు!
Ap Govt
Anand T
|

Updated on: Jul 05, 2025 | 11:01 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని అమరావతిని నూతన ఆవిష్కరణలకు వేదికగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే అమరావతిలో రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ (ఆర్‌టీఐహెచ్‌)ను త్వరలో ప్రారంభించనున్నారు. పారిశ్రామిక దిగ్గజ సంస్థలు టాటా గ్రూప్‌, ఎల్‌ అండ్‌ టి వంటి అనేక సంస్థలను ఒకే వేదిక మీదకు చేర్చి ఆర్‌టీఐహెచ్‌ను సమర్థవంతంగా నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు. ఐదేళ్లలో 20,000 స్టార్ట్‌ప్‌లతో 1000 కోట్ల పెట్టుబడి, 1 లక్ష ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే అమరావతి కేంద్రంగా ఏర్పాటయ్యే సెంట్రల్ హబ్‌కు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను కేటాయించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మొత్తం అమరావతితో పాటు ఐదు జిల్లాల పరిధిలో ఉండే గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులను ఈ ఇన్నోవేషన్ హబ్ కు కేటాయించేలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

సెంట్రల్ హబ్ అమరావతితో పాటు, విశాఖపట్నం, రాజమండ్రి, ఎన్టీఆర్, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామ, వార్డు ఉద్యోగులకు ఇన్నోవేషన్ హబ్‌కు వెళ్లనున్నారు. ప్రభుత్వ కేటాయించిన ప్రకారం వీరిలో అమరావతి సెంట్రల్ హబ్- 30 మంది, విశాఖపట్నం- 20 మంది, రాజమండ్రి- 20 మంది, ఎన్టీఆర్- 20 మంది, తిరుపతి- 20 మంది, అనంతపురం- 20 మంది వెళ్లనున్నారు. అయితే ఈ వీరిలో ఎంబీఏ (ఫైనాన్స్), ఎంకామ్, సీఏ, ఇంజినీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారిని ఇన్నోవేషన్ హబ్‌కు ఉద్యోగులుగా కేటాయించనున్నారు.

ఆర్‌టీఐహెచ్‌ అందించే ముఖ్య సేవలు..

RTIH ద్వారా యువతలో వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధి, పోటీతత్వం పెంపొందించేలా శిక్షణ ఇస్తారు.

పౌర సేవలందించే ప్రభుత్వ కార్యక్రమాలలోనూ ఆర్‌టీఐహెచ్‌ భాగస్వామ్యంగా ఉంటుంది.

భవిష్యత్తు టెక్నాలజీలైన క్వాంటమ్‌, ఏఐ జనరల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి వాటిల్లో స్టార్ట్‌పలకు RTIH సహకారం అందిస్తుంది.

వ్యవసాయం, అనుబంధ రంగాల్లోనూ, ఆక్వా, మెరైన్‌ రంగాల్లోనూ RTIH సేవలు అందిస్తుంది.

టెక్స్‌టైల్‌ ఇన్నోవేషన్‌, అపెరల్‌, ప్రత్యామ్నాయ ఫైబర్‌, ఇంధనం, క్లీన్‌టెక్‌, లైఫ్‌సైన్స్‌, ఫార్మా అండ్‌ హెల్త్‌ రంగాల్లో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది.

పట్టణ, సముద్ర రవాణా, సామాజిక వ్యాపారం, గ్రామీణాభివృద్ధి మహిళా పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు శిక్షణను ఇస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.