AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CID Attacks: డిస్టిలరీల్లో సీఐడీ దాడులు.. బయటపడుతున్న లిక్కర్‌ లీలలు..?

రాష్ట్రంలో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే ఆదేశాలు ఇస్తున్నారు.

CID Attacks: డిస్టిలరీల్లో సీఐడీ దాడులు.. బయటపడుతున్న లిక్కర్‌ లీలలు..?
Ap Cid Raids
Balaraju Goud
|

Updated on: Oct 22, 2024 | 8:45 PM

Share

ఏపీ సీఐడీ డిస్టిలరీస్‌పై దండెత్తింది. ఏకకాలంలో 30 చోట్ల 20 బృందాలు తనిఖీలు చేసింది. ఎన్టీఆర్‌ జిల్లాలో 6చోట్ల తనిఖీలు చేపట్టారు. కృష్ణా జిల్లాలో 2 చోట్ల దాడులు చేశారు. ఏలూరు, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విశాఖలోనూ సోదాలు చేస్తున్నారు. రెండు రోజుల పాటు ఈ దాడులు కొనసాగే ఛాన్స్‌ ఉంది. ఏపీ ప్రభుత్వం ఇటీవలే నూతన ఎక్సైజ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నేపధ్యంలో సీఐడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అదికూడా ఏకకాలంలో సోదాలు జరగడం హాట్‌ టాపిక్‌గా మారింది.

సీఐడీ టార్గెట్‌ ఏంటి..?

ముఖ్యంగా 2019-24 మధ్య అమ్మకాలు, సరఫరాపై సీఐడీ ఆరా తీస్తోంది. తయారైన క్వాంటిటీ, షాపులకు సప్లై అయిన క్వాంటీటీలో తేడాలున్నాయని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిస్టిలరీలు అనధికారిక మద్యాన్ని సరఫరా చేస్తూ.. వందల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు ఏపీ ప్రభుత్వం అనుమానిస్తోంది. ఇక బిల్స్‌ & పేమెంట్స్‌. చెల్లింపుల్లోనూ అవకతవకలు కూడా ఉన్నట్లు సమాచారం. మద్యం నాణ్యతను కూడా సీఐడీ అధికారుల పరిశీలించారు. లిక్కర్‌ క్వాలిటీ శాంపిల్స్ సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంత మద్యం తయారు చేశారు..? ఎవరెవరికి పంపించారు..? ప్రభుత్వ వైన్స్‌కు ఎంత సప్లై అయింది..? అనే విషయాలపై ఆరా తీశారు.

అప్పట్లో ఎక్సైజ్ శాఖ వ్యవహారాన్ని నడిపించిన ఎండీ వాసుదేవరెడ్డిపై ఇప్పటికే అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. జగన్ ఆదేశాలతో డిస్టిలరీలు, డిపోలు, మద్యం షాపులపై వాసుదేవరెడ్డి తన హవా సాగించారని, జే బ్రాండ్లు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారన్న అభియోగాలు కూడా వాసుపై ఉన్నాయి. మద్యం పేరుతో వైసీపీ చేసిన దోపిడీకి కర్త, కర్మ, క్రియ అన్నీ తానై వాసుదేవరెడ్డి పనిచేశారని, రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో రెండు నెలలుగా వాసుదేవరెడ్డి అజ్ఞాతంలో ఉన్నారని టీడీపీ విమర్శించింది. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు డిస్టిలరీలపై తనిఖీలు చేపట్టారు. అయితే గతంలో వాసుదేవరెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

సీఐడీ తనిఖీల్లో కీలక డాక్యుమెంట్‌లను పరిశీలించిన అధికారులు.. గత ప్రభుత్వ హయంలో డిజిటల్ పెమెంట్స్ కన్నా, రెగ్యులర్ పేమెంట్స్‌కే ప్రయారిటీ ఇచ్చినట్లు గుర్తించారు. ఎక్కువ మద్యం తయారు చేసి.. బిల్ లేకుండా వైన్స్‌లో అమ్మినట్లు గుర్తించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి ఎలా పడింది అనే విషయాలపై డాక్యుమెంట్‌లను పరిశీలిస్తున్నారు.

రాష్ట్రంలో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో పాటు గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం కంపెనీలు అందించిన మద్యం నాణ్యతపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సీఐడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. సీఐడీ సోదాల్లో లిక్కర్‌ లీలలు బయటకు వస్తే వాసుదేవరెడ్డి ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ALLU ARJUN: అట్లీతో అండర్ వాటర్ అడ్వెంచర్.. సందీప్‌తో వైల్డ్ రైడ్
ALLU ARJUN: అట్లీతో అండర్ వాటర్ అడ్వెంచర్.. సందీప్‌తో వైల్డ్ రైడ్
2025లో టెక్నాలజీలో భారత్ సత్తా.. ప్రపంచమే మన వైపు చూస్తుంది..
2025లో టెక్నాలజీలో భారత్ సత్తా.. ప్రపంచమే మన వైపు చూస్తుంది..
ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ప్యాకేజ్‌ ట్యాంపరింగ్‌కు గురైందని తెలుసుకోవచ్చా
ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ప్యాకేజ్‌ ట్యాంపరింగ్‌కు గురైందని తెలుసుకోవచ్చా
VARANASI: "నట దాహార్తిని తీర్చుతోంది" అంటున్న పాపులర్​ యాక్టర్
VARANASI:
IPL క్రికెట్ లో భారీగా సంపాదిస్తున్న హీరోయిన్..
IPL క్రికెట్ లో భారీగా సంపాదిస్తున్న హీరోయిన్..
ఈ స్టార్ హీరో డైలీ షెడ్యూల్ వింటే షాక్ అవ్వాల్సిందే!
ఈ స్టార్ హీరో డైలీ షెడ్యూల్ వింటే షాక్ అవ్వాల్సిందే!
ఉదయం vs సాయంత్రం: ఎక్సర్‌సైజ్ చేయడానికి ఏది బెస్ట్ టైమ్..?
ఉదయం vs సాయంత్రం: ఎక్సర్‌సైజ్ చేయడానికి ఏది బెస్ట్ టైమ్..?
టైరు పేలి అదుపుతప్పిన ప్రభుత్వ బస్సు.. 9మంది మృత్యువాత
టైరు పేలి అదుపుతప్పిన ప్రభుత్వ బస్సు.. 9మంది మృత్యువాత
చిన్న ట్రిక్‌తో సైకాలజిస్టులను కూడా ఫిదా చేసిన హీరోయిన్ అనుష్క
చిన్న ట్రిక్‌తో సైకాలజిస్టులను కూడా ఫిదా చేసిన హీరోయిన్ అనుష్క
ముగ్గురు అక్కాచెల్లెళ్లతో మహేష్ బాబు.. ఫ్యామిలీ ఫొటోస్ వైరల్
ముగ్గురు అక్కాచెల్లెళ్లతో మహేష్ బాబు.. ఫ్యామిలీ ఫొటోస్ వైరల్