Unstoppable with NBK: బావ’జాలం’.. బామ్మర్ది గాలం.. ట్రెండింగ్ నంబర్ 1గా ప్రొమో..
ఏపీలో రాజకీయ జ్వరంతో ధర్మామీటర్లు బద్దలైపోతున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్ కావాలా నాయనా అంటూ బావగారితో సిట్టింగేశారు బాక్సాఫీస్ బొనాంజా బాలయ్య. చంద్రబాబుకు జైల్లో తొలిరోజు ఎలా గడిచింది.. పవన్‌తో పొత్తు కుదిరిన క్షణాల్లో ఆయన ఫీలింగేంటి.. స్టూడెంట్ డేస్‌లో చంద్రబాబు చేసిన అల్లరేంటి.. విజన్ 2047పై ఆయనిచ్చిన లీకేంటి? లోకేష్-పలన్-బాలయ్య వీళ్లు ముగ్గురిలో చంద్రబాబుకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? అన్ని ప్రశ్నలకూ ఒకే వేదికపై సమాధానం సిద్ధంగా ఉంది.
బావ వర్సెస్ బావమరిది.. నారా చంద్రబాబు.. వర్సెస్ నందమూరి బాలకృష్ణ. ఆహాలో ఈసారి వీళ్ల ఫన్నీ ఫైటింగ్ మామూలుగా ఉండేట్టులేదు. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్‌లో ఓసారి తనయుడు లోకేష్‌తో కలిసి గెస్టుగా వచ్చి.. హోస్ట్ సీట్లో ఉన్న బాలయ్యతో ఫన్‌గేమ్ ఆడారు. అప్పుడాయన ప్రతిపక్షనేత. ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్. ముఖ్యమంత్రి హోదాలో అదే రియాలిటీ షోలో నయా సీజన్‌కి అతిథిగా వచ్చారు చంద్రబాబు. గెస్ట్ ఇంట్రడక్షన్ దగ్గరే హోస్ట్ హ్యూమర్ పవర్ ఏంటో తెలిసిపోయింది.
క్వశ్చనింగ్‌లో ఆయన.. ఆన్సరింగ్‌లో ఈయన అన్‌స్టాపబుల్ సీజన్-4కి కిక్ స్టార్ట్ ఇవ్వబోతున్నారు. ట్రయిలర్‌తోనే ఫన్ అన్‌లిమిటెడ్ అని సాలిడ్‌గా ఓ హింట్ ఇచ్చేశారు. ఫన్ను దగ్గరే ఆగలేదు. చంద్రబాబు మనోగతాన్ని ఆవిష్కరించడంలో బరువైన ఎమోషన్లు కూడా పండించారు మిస్టర్ అఖండ.
జైలు జీవితంలో ఎదురైన చేదు అనుభవాల్ని ఇదే డయాస్ మీద షేర్ చేసుకుంటారా..? అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్. పవన్‌కల్యాణ్‌తో చంద్రబాబుకు వ్యక్తిగతంగా ఉండే ఎటాచ్‌మెంట్ ఎలాంటిది.. పొత్తు కుదుర్చుకునే ముందు రాజమండ్రి జైల్లో ఇద్దరిమధ్యా జరిగిన మంతనాలేంటి.. అనేది అంతకుమించిన క్యూరియాసిటీ.
వీళ్ల ఫన్‌గేమ్‌లోకి ఇద్దరి ఫ్యామిలీల్ని కూడా ఇన్‌వాల్వ్ చేస్తే ఇంకెంత మజా..? ఇంటిగుట్టు రచ్చన పడకుండా.. అలాగని హ్యూమర్ మిస్ కాకుండా.. టెంపో కంటిన్యూ చేస్తూ.. ఎవరు ఎంత జాగ్రత్తపడ్డారు..? వైజాగా విజయవాడా.. దేనికి మీ ఓటు అంటే చంద్రబాబు ఏం చెబుతారు..? నా చెల్లెలితో చూసిన రొమాంటిక్ సినిమా ఏంటి.. అన్నప్పుడు బావ నిజంగానే ఇరకాటంలో పడ్డారా..? బాబు కెప్టెన్సీని ధోనీతో పోల్చినప్పుడు వచ్చిన రియాక్షన్లేంటి..? ఇలా సీరియస్ కంటెంటే కాదు.. హిలేరియస్ కౌంటర్లక్కూడా కొరతల్లేవు.
గన్ ఒకరిది.. ఫన్ ఒకరిది.. కానీ ఎవరిది గన్ను.. ఎవరిది ఫన్ను తెలుసుకోవడమే కష్టం. ఎందుకంటే.. ఒకర్ని మించి మరొకరు హ్యూమర్‌ని పండించారని వాళ్లవాళ్ల ఫ్యాన్ ఫాలోయింగులు సర్టిఫై చేస్తున్నాయి. ఇంతకీ.. ఈ ఫన్ అన్‌లిమిటెడ్ పోటీలో ఎవరు తగ్గారు.. ఎవరు నెగ్గారు.. బావనుంచి కావల్సినంత స్టఫ్ఫును రాబట్టడంలో బాలయ్య సక్సెస్ అయ్యాడా.. లేక ఆ బావగారే దాగుడుమూతలతో సరిపెట్టారా.. అనేది అక్టోబర్ 25న ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యాకే తెలిసేది. కాగా ఈ ప్రొమో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్ 1లో కొనసాగుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.