Guntur Incident: గుంటూరు ఘటనపై మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం జగన్‌, చంద్రబాబు

ఇటీవల ఏపీలోని కందుకూరు విషాదాన్ని మర్చిపోకముందే మరో ఘోరం జరిగిపోయింది. కొత్త సంవత్సరం రోజున గుంటూరు జిల్లాలో చంద్రబాబు కార్యక్రమంలో తీవ్ర విషాదం నెలకొంది. జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీలో..

Guntur Incident: గుంటూరు ఘటనపై మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం జగన్‌, చంద్రబాబు
Guntur Incident
Follow us
Subhash Goud

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jan 02, 2023 | 6:35 AM

ఇటీవల ఏపీలోని కందుకూరు విషాదాన్ని మర్చిపోకముందే మరో ఘోరం జరిగిపోయింది. కొత్త సంవత్సరం రోజున గుంటూరు జిల్లాలో చంద్రబాబు కార్యక్రమంలో తీవ్ర విషాదం నెలకొంది. జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృత్యువాత పడ్డారు. అయితే ఘటన జరిగిన వెంటనే మహిళల్ని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని బతికించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. లక్ష్మమ్మ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కానుకల కోసం మహిళలు ఒకేసారి తోసుకురావడం వల్లే తొక్కిసలాట జరిగింది. 15 లారీల్లో కానుకలను తీసుకువచ్చి వాటిని పంపిణీ చేసేందుకు 15 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కౌంటర్‌ల వద్ద తొక్కిసలాట నెలకొంది.

మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల సాయం

కాగా, మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించింది ఉయ్యూర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌. ఈ ఘటనకు ఉయ్యూర్‌ ఫౌండేషన్‌దే పూర్తి బాధ్యత, ఘనటపై ప్రభుత్వం రాజకీయం చేయవద్దని, ప్రభుత్వం సరిపడ బందోబస్తు ఏర్పాటు చేయలేదని టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు.

సీఎం జగన్‌ రూ.2 లక్షల చొప్పున సాయం

గుంటూరు ఘనటపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన నన్ను చాలా కలచివేసింది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు సీఎం జగన్‌. గాయపడిన వారికి రూ.50 వేలు ప్రకటించారు.

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సాయం

కాగా, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు కోవెలమూడి రవీంద్ర. లక్ష రూపాయల చొప్పున డేగల ప్రభాకర్‌ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 చొప్పున పరిహారం ప్రకటించారు.

బారికేడ్లు విరిగిపడటంతోనే ప్రమాదం: ఎస్పీ

జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీలో తొక్కిసలాటలో బారికేడ్లు విరిగిపడటంతోనే ప్రమాదం జరిగిందని గుంటూరు ఎస్పీ ఆరిఫ్‌ అన్నారు. మొదటి కౌంటర్‌ దగ్గరే ప్రమాదం జరిగిందని, అయితే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పామని అన్నారు. మేం సరిపడా బందోబస్తు ఇచ్చామని వివరించారు.

రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన చంద్రబాబు

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు చంద్రబాబు నాయుడు. నేను వెళ్లిన అనంతరం జరిగిన ఘటనలో ముగ్గురు చనిపోవడం బాధాకరం. స్వచ్ఛంద సంస్థ చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని, అదే ఆలోచనతో నేను కార్యక్రమానికి వెళ్లానని చంద్రబాబు అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి