Chandrababu Naidu: విచారణకు హాజరుకాని చంద్రబాబు, బోండా ఉమా.. ఏపీలో మరింత ముదురుతున్న వివాదం..

AP Women's Commission: ఏపీలోని విజయవాడ ప్రభుత్వ (GGH Vijayawada) ఆసుపత్రిలో ఓ మానసిక దివ్యాంగురాలిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.

Chandrababu Naidu: విచారణకు హాజరుకాని చంద్రబాబు, బోండా ఉమా.. ఏపీలో మరింత ముదురుతున్న వివాదం..
Chandrababu Naidu, Bonda Um
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 27, 2022 | 2:00 PM

AP Women’s Commission: ఏపీలోని విజయవాడ ప్రభుత్వ (GGH Vijayawada) ఆసుపత్రిలో ఓ మానసిక దివ్యాంగురాలిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. అయితే.. ఆసుపత్రిలో పరామర్శల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బొండా ఉమా.. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో 27న హాజరై వివరణ ఇవ్వాలని రాష్ట్ర మహిళా కమిషన్ చంద్రబాబు నాయుడు, బోండా ఉమాకు నోటీసులు ఇచ్చింది. కాగా.. ఈ వివాదం మరింత ముదురుతోంది. ఈ విచారణకు చంద్రబాబు, బోండా ఉమా హాజరుకాలేదు. దీంతో ఈ విషయంపై రాజకీయాలు మరింత ముదురుతున్నాయి. ఈ క్రమంలోనే హాస్పిటల్ లో జరిగిన వివాదంపై ఏపీఐడిసి చైర్మన్ పుణ్యశిల సీపీ క్రాంతి రాణాను కలిసి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. అత్యాచార ఘటన విషయంలో హాస్పిటల్లో జరిగిన వివాదం టీడీపీ నేత బోండా ఉమాపై పుణ్యశిల సీపీకి ఫిర్యాదు చేశారు. ఉమా హాస్పిటల్లో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మపై దుర్భాషలాడారంటూ ఫిర్యాదు చేశారు. తన జనాన్ని తీసుకెళ్లి బాధితురాలిని ఇబ్బంది పెట్టారని తెలిపారు. ఈ సమయంలో మహిళ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని తెలిపారు. దుర్భాషలాడిన బొండా ఉమా పై 498 కేసు నమోదు చేయాలని సీపీని కోరినట్లు పుణ్యశీల తెలిపారు. ఉమాపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సీపీకి ఫిర్యాదు చేశానన్నారు.

వివరణ ఇవ్వాలనుకున్నాం.. వాసిరెడ్డి పద్మ

కాగా.. చంద్రబాబు మహిళా కమిషన్ ఎదుట హాజరు కాకపోవడంపై వాసిరెడ్డి పద్మ స్పందించారు. చంద్రబాబు మహిళా కమిషన్ ను గౌరవిస్తారని అందరూ భావించారు కానీ.. ఆయన నైతిక విలువలు లేకుండా ప్రవర్తించారన్నారు. మహిళల పట్ల ఎలా వ్యవహరించాలో చెప్పడానికి నోటీసులు ఇచ్చినట్లు పద్మ తెలిపారు. ఈ క్రమంలో ధర్నాలకు పిలుపునివ్వడం, మహిళా కమిషన్ దగ్గర ఆందోళన చేయడం సరికాదన్నారు. హాస్పిటల్లో నైతిక విలువలు లేకుండా ప్రవర్తించారని.. అత్యాచార బాధితుల పట్ల ఎలా ఉండాలనేది చెప్పాలనుకున్నామని తెలిపారు. చంద్రబాబు,బోండా ఉమా చేసిన తప్పు ఏంటో మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు పది తప్పులను ప్రస్తావించారు.

పదుల సంఖ్యలో బాధితురాలి దగ్గరికి వెళ్లడం, గుంపులుగా వచ్చి గట్టిగా అరవడం, బాధితురాలిని భయకంపితులు చేయడం, సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మంది మార్బలంతో రావడం, మహిళా కమిషన్ ఛైర్పెర్సన్ ను అడ్డుకోవడం, పరామర్శించకుండా అడ్డుకోవడం, బెదిరించడం, విధులు అడ్డుకోవడం, చంద్రబాబు తనను వ్యక్తిగతంగా బెదిరించడం, ఉమా అనుచిత పదజాలంతో దూషించడం, కుటుంబ సభ్యులను మీడియా ముందుకు తిప్పడం లాంటి తప్పులు చేశారని తెలిపారు. దీనిపై న్యాయనిపుణులతో చర్చించి ముందుకెళ్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.

Also Read: CM KCR Speech: క‌త్తుల కోలాటాలు కాదు.. తాగునీరు, ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు కావాలి..

Fact Check: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కీలక ప్రకటన