CM KCR Speech: క‌త్తుల కోలాటాలు కాదు.. తాగునీరు, ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు కావాలి..

TRS Foundation Day: దేశంలోని తాజా పరిస్థుతులపై ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీ ప్లీన‌రీ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు. దేశంలో మ‌తం, కులం పేరిట రాజకీయాలు చేస్తున్న..

CM KCR Speech: క‌త్తుల కోలాటాలు కాదు.. తాగునీరు, ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు కావాలి..
Cm Kcr At Trs Foundation Da
Follow us
Sanjay Kasula

| Edited By: Ravi Kiran

Updated on: Apr 27, 2022 | 1:59 PM

దేశంలోని తాజా పరిస్థుతులపై ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR ). టీఆర్ఎస్ పార్టీ ప్లీన‌రీ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు. దేశంలో మ‌తం, కులం పేరిట రాజకీయాలు చేస్తున్న పార్టీల‌పై మండిపడ్డారు. ఈ దేశానికి కావాల్సింది క‌త్తుల కోలాట‌లు, తుపాకుల చ‌ప్పుళ్లు కాదన్నారు. దేశానికి కావల్సినది క‌రెంట్, సాగునీరు, తాగునీరు, ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలని కేసీఆర్ గుర్తు చేశారు. జాతిపిత మహాత్మాగాంధీని దూష‌ణ‌లు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. ఇదేం దుర్మార్గం.. స్వాతంత్ర్యం కోసం వ్య‌క్తిగ‌త జీవితాన్ని త్యాగం చేసి, జాతిపిత‌గా పేరు తెచ్చుకున్న వ్య‌క్తిని దుర్భ‌ష‌లాడ‌ట‌మా..? ఆయ‌నను చంపిన హంత‌కుల‌ను పూజిచండ‌మా? ఇది సంస్కృతా? ఇది ప‌ద్ధ‌తా? ఎందుకు ఈ విద్వేషం.. ఏం ఆశించి దేశ ప్రజలను ర‌గుల్చుతున్నారు. ఏ ర‌క‌మైన మ‌త పిచ్చి లేపుతున్నారని సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.

మనలాంటి దేశానికి మ‌త విద్వేషాలు మంచిది కాదన్నారు. కుటిల రాజ‌కీయాలు చేసి, ప‌ద‌వుల కోసం విధ్వంసం చేయ‌డం తేలిక‌నే.. అదే క‌ట్టాలంటే ఎంత శ్ర‌మ అవ‌స‌రం అని అన్నారు. క‌త్తులతో విధ్వంసం సృష్టిస్తే ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తాయా..? అంటూ ప్రశ్నించారు. మ‌న పొరుగు రాష్ట్రం క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరు సంపాదించింద‌ని గుర్తు చేశారు. అక్క‌డ‌ 30 ల‌క్ష‌ల మందికి ప్ర‌త్య‌క్షంగా ఉద్యోగాలున్నాయన్నారు.

ప‌రోక్షంగా మ‌రో 30 ల‌క్ష‌ల మంది బతుకుతున్నారని అన్నారు. దీని వెనకాల ఎంతో మంది కృషి ఉందన్నారు. కానీ ఇటీవ‌ల కాలంలో హిజాబ్, హ‌లాల్ వివాదాలు జరుగుతున్నాయని అన్నారు ఆ రాష్ట్రంలో. కులం మ‌తం పేరుతో దుర్మార్గ‌పు రాజ‌కీయాలు చేస్తున్నారు.

అమెరికాలో మ‌నోళ్లు 13 కోట్ల మంది ఉద్యోగం చేస్తూ జీవ‌నం సాగిస్తున్నారు. మీరు మా మ‌త‌స్తులు, కుల‌స్తులు కాదని పంపిస్తే వీరు ఉద్యోగాలు ఇస్తారా..? ఇది ఎవ‌రికీ మంచిది కాదు. దీని వ‌ల్ల ఏం సాధిస్తారు. దేశం అన్ని రంగాల్లో నాశ‌న‌మై పోయింది. పోయినా స‌ర్కారే మంచిగా ఉండే అని మాట్లాడుతున్నారు.

నిరుద్యోగం పెరిగింది. ఆక‌లి పెరిగింది. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. నిత్యావ‌స‌ర‌ల ధ‌ర‌లు పెరుగుతున్నాయి. ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డ్డాయి. ఇన్నీ స‌మ‌స్య‌ల‌తో దేశం స‌త‌మ‌త‌మ‌వుతుంటే.. దీనిపై దృష్టి పెట్ట‌కుండా.. విద్వేషం, ద్వేషం ఒక పిచ్చి దేశానికి లేపి రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుతున్నార‌ని సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

ఇవి కూడా చదవండి: TRS Foundation Day Live: రాష్ట్రాల మ‌ధ్య నీటి యుద్ధాలు ఎందుకు.. ప్లీన‌రీ వేదిక‌గా సీఎం కేసీఆర్

PM Narendra Modi: కరోనా ఫోర్త్ వేవ్ అలర్ట్.. ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ.. ఈ అంశాలపైనే చర్చ..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..