AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR Speech: ప్రధాని సొంత రాష్ట్రంలోనూ విద్యుత్ కోతలు.. కేంద్రాన్ని టార్గెట్ చేసిన సీఎం కేసీఆర్..

TRS Foundation Day: దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. కరేంటు కోతలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

CM KCR Speech: ప్రధాని సొంత రాష్ట్రంలోనూ విద్యుత్ కోతలు.. కేంద్రాన్ని టార్గెట్ చేసిన సీఎం కేసీఆర్..
Cm Kcr
Shaik Madar Saheb
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 27, 2022 | 1:59 PM

Share

TRS Foundation Day: దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. కరేంటు కోతలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు ఉన్నాయని తెలంగాణలో లేవని పేర్కొన్నారు. కర్ణాటక, ఏపీ సహా ప్రధాని ప్రాతినిథ్యం వహిస్తున్న గుజరాత్‌లో కూడా విద్యుత్ కోతలు ఉన్నాయని CM KCR పేర్కొన్నారు. దేశంలో తాగునీరు, సాగునీరు, కరేంటు లేదని.. ఉపన్యాసాలు వింటే మైకులు పగిలిపోవాల్సిందేనని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ 21 వ‌సంతాలు పూర్తి చేసుకుని 22వ ఏట అడుగుపెడుతున్న సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణుల‌కు అభినంద‌న‌లు తెలిపారు. ప్లీనరీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ కంచుకోట అంటూ స్పష్టంచేశారు. తెలంగాణ జల బండగారం అయిందని వెల్లడించారు. అవినీతితో వికెట్ పడే మంత్రులు తెలంగాణలో ఎవరూ లేరంటూ కేసీఆర్ పేర్కొన్నారు. 3 మెడికల్ కాలేజీలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 33 మెడికల్ కాలేజీలు నిర్మించుకుంటున్నామని తెలిపారు.

టీఆర్ఎస్ పని చేసిన తీరుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వ తీరు ఉంటే 14లక్షల కోట్ల జిడిపి ఉండేదని.. కానీ అసమర్ధత వల్ల అట్టడుగు చేరుకుందని తెలిపారు. దేశంలో స్వతంత్ర ఫలాలు అందరికీ లభించలేదని పేర్కొన్నారు. దేశంలో పెడ దోరణి పెరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆరేళ్ల కాలంలో వెలుగు జిలుగుల తెలంగాణను ఆవిష్కరించామని.. కానీ దేశంలో కరెంట్ కోతలు ఎందుకు ఉన్నాయంటూ ప్రశ్నించారు. దేశ నదుల్లో నీటి లభ్యత 65వేల టిఎంసి అని.. 30వేల టీఎంసీలను మాత్రమే దేశం వినియోగించుకుంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఎందుకు ఈ దౌర్భాగ్యం.. లోపం ఎక్కడ ఉందంటూ నిలదీశారు.

దేశంలో తాగునీరు, సాగునీరు లేవని.. మౌలిక వసతులు లేవని పేర్కొన్నారు. దీనికి కారణం ఎవరంటూ నిలదీశారు. దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాలని.. పరిష్కారం లభించాలన్నారు. అందుకోసం మనం దేశ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Also Read:

CM KCR Speech: టీఆర్ఎస్‌కు వెయ్యి కోట్ల ఆస్తులు.. తెలంగాణ కాప‌లాదారు పార్టీ..