PM Narendra Modi: కరోనా ఫోర్త్ వేవ్ అలర్ట్.. ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ.. ఈ అంశాలపైనే చర్చ..
PM Modi COVID-19 review with CMs: దేశంలో కరోనావైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కోవిడ్-19 థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు, మరణాలు మళ్లీ పెరుగుతుండటంతో
PM Modi COVID-19 review with CMs: దేశంలో కరోనావైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కోవిడ్-19 థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు, మరణాలు మళ్లీ పెరుగుతుండటంతో నిపుణులు ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. వర్చువల్‌గా జరుగుతున్న ఈ సమావేశంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై ముఖ్యమంత్రులతో ప్రధాని మాట్లాడుతున్నారు. దేశంలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్-19 కేసుల కారణంగా ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు తదితర అంశాలపై ప్రధాని మోడీ ముఖ్యమంత్రులతో చర్చించే అవకాశముంది. దీంతోపాటు మరో వేవ్ ను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దేశంలో జరుగుతున్న వాక్సినేషన్ ప్రక్రియ, చిన్నారులకు వ్యాక్సిన్ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఒకవేళ ఫోర్త్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలు, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, డ్రగ్స్ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొననున్నారు.
వీసీలో పాల్గొన్న సీఎం జగన్..
కాగా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ వీసీలో పాల్గొన్నారు.
Speaking at a meeting with Chief Ministers. https://t.co/WyeQyQS0UQ
— Narendra Modi (@narendramodi) April 27, 2022
ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో కరోనా (Covid-19) కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 2,927 కేసులు నమోదు కాగా..32 మంది మరణినంచారు. నిన్నటితో పోల్చుకుంటే 444 కేసులు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 16,279 (0.04 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేటు 0.58శాతం ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,30,65,496 కి చేరగా.. మరణాల సంఖ్య 5,23,654 కి పెరిగింది. ఇప్పటివరకు 4,25,25,563 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
CM KCR Speech: ప్రధాని సొంత రాష్ట్రంలోనూ విద్యుత్ కోతలు.. కేంద్రాన్ని టార్గెట్ చేసిన సీఎం కేసీఆర్..