Suicide Bomber: ఆత్మాహుతి దాడి చేసిన మహిళా ఉగ్రవాదికి సంబంధించి సంచలన విషయాలు.. వీడియోలో దాడి దృశ్యాలు
Karachi University Blast: పాకిస్థాన్‌లోని కరాచీ యూనివర్సిటీ (Karachi University)లో చైనా జాతీయులపై ఆత్మాహుతి దాడికి పాల్పడిన మహిళా ఉగ్రవాదికి సంబంధించి సంచలన విషయాలు
Karachi University Blast: పాకిస్థాన్‌లోని కరాచీ యూనివర్సిటీ (Karachi University)లో చైనా జాతీయులపై ఆత్మాహుతి దాడికి పాల్పడిన మహిళా ఉగ్రవాదికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఉగ్రదాడి (Terror Attack)లో ముగ్గురు చైనా జాతీయులు సహా నలుగురు మరణించారు. అయితే ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఆ ఉగ్రవాది పేరు షరీ బలూచ్ (30). బలూచిస్థాన్‌లోని టుర్బాట్‌లోని నియాజర్ అబద్‌కు చెందిన ఆమె ఉన్నత విద్యావంతురాలిగా తెలిసింది. జువాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఓ వైద్యుడిని పెళ్లాడిన షరీ బాలూచ్‌కు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒకరు 8 సంవత్సరాలు, మరొకరు 5 సంవత్సరాలు. ఆమె భర్త హబిటాన్ బషీర్ బలోచ్, డెంటిస్ట్‌గా పని చేస్తున్నారు. ఆమె తండ్రి లెక్చరర్. ఇక బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) విడుదల చేసిన ఉగ్రవాది వివరాల ప్రకారం.. షరీ ప్రస్తుతం ఎంఫిల్ చేస్తోంది. అంతేకాకుండా ఆమె పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నట్లు తెలిపింది. రెండు సంవత్సరాల కిందట ఆమె బీఎల్‌ఏలోని మజీద్ బ్రిగేడ్ ప్రత్యేక బలిదాన దళంలో చేరింది. అయితే ఆమెకు ఇద్దరు పిల్లలు ఉండడంతో ఈ దళం నుంచి తప్పుకునేందుకు అవకాశం వచ్చినా అందుకు ఆమె నిరాకరించింది. ఇప్పుడు మజీద్ బ్రిగేడ్ బలూచిస్థాన్, పాకిస్థాన్‌లలోని చైనా జాతీయులను, చైనా ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుంటుందని హెచ్చరించింది.
ఈ సందర్భంగా బీఎల్ఏ ప్రతినిధి జీయాంద్ బలూచ్ మాట్లాడుతూ.. చైనా ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విస్తరణకు చిహ్నమైన కన్ఫ్యూషియస్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్, అధికారులను లక్ష్యంగా చేసుకోవడం, బలూచిస్థాన్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా చైనా ఉనికిని సహించబోమని స్పష్టమైన సందేశాన్ని అందించేందుకే ఈ దాడికి పాల్పడిందని తెలిపారు.
ఒక పేలుడులో ముగ్గురు చైనా పౌరులతో సహా కనీసం నలుగురు వ్యక్తులు మరణించారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. కరాచీలోని యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన పేలుడు ఘటనను పాకిస్థాన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఖండించింది. ఇదిలా ఉండగా, కరాచీ యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన ఘోరమైన దాడి నేపథ్యంలో బుధవారం మూసివేయాలని నిర్ణయించారు.
CCTV footage of woman suicide attacker targeting vehicle carrying Chinese nationals within Karachi University (video h/t @ghulamabbasshah)pic.twitter.com/PDmEtZHugb
— Rezaul Hasan Laskar (@Rezhasan) April 26, 2022
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి చదవండి