British Woman: ఆమె వయసు99.. ఏకంగా యుద్ద విమానాన్నే నడిపింది..!
British Woman: సాధారణంగా వృద్ధాప్యంలో ప్రజలు చాల బలహీనంగా ఉంటారు. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. సరిగ్గా నడవలేరు.
British Woman: సాధారణంగా వృద్ధాప్యంలో ప్రజలు చాల బలహీనంగా ఉంటారు. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. సరిగ్గా నడవలేరు. వారి సొంత పనులు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఇంకొంత మంది సొంత కుటుంబ సభ్యులనే మరచిపోతారు. కానీ ఒక బ్రిటీష్ మహిళ వీటన్నింటిని అధిగమించి 99 ఏళ్ల వయసులో యుద్ధ విమానాన్ని నడిపి అందరిని ఆశ్చర్యపరిచింది. తనలాంటి ఎందరికో స్పూర్తినిచ్చింది. 99 ఏళ్ల వయసులో విమానం నడపడం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయం తెలిసిన చాలామంది షాక్ అవుతున్నారు.
ఆ మహిళ పేరు కేట్ ఆర్చర్డ్. ఆమె కార్న్‌వాల్‌లో నివసిస్తోంది. కేట్ గతంలో బ్రిటిష్ రాయల్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేశారు. ఆమె పైలట్‌గా రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంది. కానీ ఇప్పుడు ఆమె వయస్సు 99 సంవత్సరాలు. ఈ వయసులో యుద్ధ విమానం నడపడం నిజంగా చాలా కష్టం. కానీ ఆమె చాలా సులువుగా చేసి చూపించింది.
కేట్ విమానాన్ని సులభంగా టేకాఫ్ చేయడమే కాకుండా అంతే సులభంగా ల్యాండ్ కూడా చేసింది. ఈ అద్భుత దృశ్యాన్ని ఆమె కుటుంబ సభ్యులు దగ్గరుండి వీక్షించారు. పలు మీడియా సంస్థలు వార్తను బ్రేకింగ్ న్యూస్‌గా ప్రచారం చేశాయి. కాగా, విమానంలో ప్రయాణించడం ద్వారా తన పాత రోజులను గుర్తుచేసుకున్నట్లు కేట్ చెప్పారు. అంతేకాదు విమానం నడపడం అనేది తనకి పెద్ద కష్టమేమి కాదని అన్నారు.
Also read:
Viral Video: వ్యాన్‌కు వేలాడుతూ పాము షికారు.. వీడియో చూస్తూ ఫ్యూజులు ఔట్..!
Telangana Group 1: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసింది.. పూర్తి వివరాలివే..
Andhra Pradesh: అనిల్ ఇంటికి వెళ్లిన మంత్రి కాకాని.. కలిసిన చేతులు.. కలవని చూపులు..!