Tibetan Buddhism: 27 ఏళ్ల క్రితం దలైలామా తదుపరి వారసుడుగా ఎంపికైన పంచన్ లామా ఎక్కడున్నాడు?
తన వారసుడి ఎంపిక విషయంలో దలైలామా స్పందన చైనాకు మింగుడు పడటం లేదు. నా పునర్జన్మ (తదుపరి దలైలామా ఎంపిక) నిర్ణయం నాదే. తదుపరి దలైలామాగా ఎవరు ఉండాలో నిర్ణయించే హక్కు ఇతరులకు లేదన్నారు.

China Abducted Panchen Lama: 27 ఏళ్ల క్రితం దలైలామా పంచెన్‌లామాగా బిరుదు పొందిన తర్వాత అదృశ్యమైన టిబెటన్ బాలుడు.. చైనా పౌరుడిగా సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడని చైనా మంగళవారం తెలిపింది. ఆయన అదృశ్యంపై అమెరికా ఆందోళనలను చైనా తోసిపుచ్చింది. 1995లో తప్పిపోయిన టిబెటన్ బాలుడు గెధున్ చౌకి నిమా ఆచూకీని వెల్లడించాలని అమెరికా కోరింది. దీనిపై స్పందించిన చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్, “టిబెట్ సంబంధిత ప్రయోజనాలను ఉపయోగించుకుని చైనా దేశీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి మాకు ఆసక్తి లేదు.” అంటూ అమెరికాకు ఘాటుగా సమాధానం ఇచ్చారు.
మరోవైపు, దలైలామా తర్వాత టిబెటన్ బౌద్ధుల రెండవ అత్యున్నత ఆధ్యాత్మిక నాయకుడిగా నిమా 1995లో 11వ పంచన్ లామాగా ఎంపికయ్యారు. కొన్ని రోజులు గడిచినా నీమా ఆచూకీ లభించలేదు. టిబెట్‌ను తమ దేశంలో భాగంగా పేర్కొంటున్న చైనా, ఈ నామినేషన్‌ను తిరస్కరించింది. ఆరేళ్ల బాంకెన్ అర్దినికి ఈ బిరుదును ఇచ్చిందని పేర్కొంది. 11వ పంచన్ లామాగా నియమితులైనప్పుడు నిమాకు ఆరేళ్లు. అప్పటి నుండి కనిపించకుండాపోయాడు. వారి కుటుంబం గురించి పెద్దగా ఎవరు తెలియకుండాపోయింది.
మంగళవారం, నిమా 33వ పుట్టినరోజున, US స్టేట్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో ఇలా పేర్కొంది, “11వ పంచన్ లామా మే 17, 1995న ఆరేళ్ల వయసులో చైనా అధికారులు అపహరించినప్పటి నుండి తప్పిపోయారు.” “మేము చైనా అధికారులను కోరుతున్నాము. నిమా గురించి తక్షణ సమాచారాన్ని అందించాలి. చైనా అంతర్జాతీయ కట్టుబాట్లకు అనుగుణంగా వారి మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛలను పూర్తిగా కొనసాగించాలి.” అని కోరింది.
ఇదిలావుంటే, దలైలామా వారసుడిని తామే ఎంపిక చేయాలని పట్టుదలతో ఉన్నా చైనా.. గతంలో భారత్‌కు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. దలైలామా వారసుణ్ని కచ్చితంగా చైనా నుంచే ఎన్నుకోవాలని, దీనికి భిన్నంగా ఈ అంశంలో భారత్ జోక్యం చేసుకొంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని డ్రాగన్ హెచ్చరించింది. దలైలామా ఎంపిక అంతర్గత వ్యవహారం, ఇందులో పొరుగు దేశం జోక్యం చేసుకోదని, భారత్ కూడా అదే విధానాన్ని అనుసరిస్తుందని భావిస్తున్నామని చైనా గతంలోనే స్పష్టం చేసింది. కొత్త దలైలామా టిబెట్ సంస్కృతి, వారసత్వాన్ని రక్షించాలని, ఇదే అంశం ప్రాతిపదికగా.. 1792లో క్వింగ్ రాజ వంశం ఈ సంప్రదాయానికి తెరతీసిందని చైనా వాదిస్తోంది. దలైలామా ఎంపికపై తొలిసారి చైనా స్పష్టమైన ప్రకటన చేయడం గమనార్హం.
తన వారసుడి ఎంపిక విషయంలో దలైలామా స్పందన చైనాకు మింగుడు పడటం లేదు. నా పునర్జన్మ (తదుపరి దలైలామా ఎంపిక) నిర్ణయం నాదే. తదుపరి దలైలామాగా ఎవరు ఉండాలో నిర్ణయించే హక్కు ఇతరులకు లేదన్నారు. చైనా ఎంపికచేసే వారసుడికి గౌరవం దక్కదని ఆయన స్పష్టం చేశారు. తన వారసుడు భారత్‌లోని తన అనుచురల్లో ఒకరు కావచ్చని కూడా ఆయన తెలిపారు. తన వారసుడిని ఎంపిక చేసేది లేనిదీ తనకు 90 ఏళ్ల వయసు వచ్చాక నిర్ణయిస్తానని దలైలామా 2011లో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన వయసు 87 ఏళ్లు.
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా 1959లో భారత్‌కు వలస వచ్చారు. ఆయనతోపాటు కొందరు స్థానికులు కూడా భారత్‌కు వచ్చేశారు. ధర్మశాలలో భారత్ వారికి ఆశ్రయం కల్పించింది. ఆయన ఆరోగ్యం క్షీణించినట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన వారసుడి ఎంపికపై చైనా ఆత్రంగా ఎదురు చూస్తోంది.
Read Also… Big News Big Debate: జనసేన – వైసీపీ మధ్య పేలుతున్న మాటల ఫటాసులు.. ఏపీలో ఎందుకీ బీప్ పాలిటిక్స్?
