AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News Big Debate: జనసేన – వైసీపీ మధ్య పేలుతున్న మాటల ఫటాసులు.. ఏపీలో ఎందుకీ బీప్‌ పాలిటిక్స్‌?

ఏపీలో రెండేళ్లు ముందే కులాలు, బీప్‌ పాలిటిక్స్‌ మొదలయ్యాయి. ఇది ఎన్నికల దాకా కొనసాగే అవకాశం ఉంది. ఇంతకీ పవన్‌ కల్యాణ్‌ను కావాలని వైసీపీ రెచ్చగొడుతుందా? జనసేనలు కూడా హద్దులు మీరుతున్నారా? ఎవరి లక్ష్యం ఏంటి?

Big News Big Debate: జనసేన - వైసీపీ మధ్య పేలుతున్న మాటల ఫటాసులు.. ఏపీలో ఎందుకీ బీప్‌ పాలిటిక్స్‌?
Big News Big Debate 26 04 2022 Live Video On Janasena Vs Ycp
Balaraju Goud
|

Updated on: Apr 26, 2022 | 8:50 PM

Share

Big News Big Debate: టీడీపీ – వైసీపీ మధ్య అసెంబ్లీలో తిట్ల పురాణం ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. ఇప్పుడు అంతకుమించిన వ్యక్తిగత విమర్శలతో జనసేన – వైసీపీ మధ్య మాటలే పటాసుల్లా పేలుతున్నాయి. అధికారపార్టీలో టాప్‌ టూ బాటమ్‌ లీడర్స్ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అటు జనసేనల నుంచి కూడా అంతే వేగంగా వాగ్భాణాలు దూసుకొస్తున్నాయి.

ఇరుపార్టీల అధినేతలే తిట్లదండకం మొదలుపెట్టడంతో ఇక కేడర్‌ సైలెంట్‌గా ఉంటుందా. ఎవరికి నచ్చినట్టు వారు నోటికి పనిపెడుతున్నారు. అయితే ఇదంతా 2024 ఎన్నికలకే దృష్టిలో పెట్టుకునే ఇరుపార్టీలో రాజకీయక్షేత్రంలో దిగినట్టు కనిపిస్తోంది. బీజేపీతో పొత్తులో ఉన్నా లైట్గా తీసుకున్న వైసీపీ.. ఇటీవల పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలతో వ్యూహం మార్చింది. ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీల్చేది లేదన్న జనసేనాని కామెంట్లతో మళ్లీ తెలుగుదేశం పార్టీతో పవన్‌ పొత్తుకు సిద్దమవుతున్నారన్న అనుమానం వైసీపీ నేతల్లో వ్యక్తమయింది. అనుమానం కాదు.. బలంగా నమ్ముతోంది. గతంతో టీడీపీ అధికారంలో ఉండగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికికే పోటీచేసి.. ఇప్పుడు మాత్రం చీల్చేది లేదనడం వెనక టీడీపీ అజెండా ఉందని వైసీపీ నమ్ముతోంది. అందుకే చంద్రబాబుకు దత్తపుత్రుడని బలంగా జనాల్లోకి తీసుకెళుతుంది. కాపుల ఓట్లు కట్టగట్టి బాబు పాదాల వద్ద పడేయడమే మీ లక్ష్యం అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు వైసీపీ నేతలు.

చంద్రబాబుకు పవన్‌ దత్తపుత్రుడుగా మారారంటూ వైసీపీ విమర్శలు చేస్తుంటే.. జనసేన కూడా కుల ప్రస్తావన బలంగా తీసుకొస్తోంది. తెలుగుదేశం పార్టీతో 2018 లోనే తెగతెంపులు అయ్యాయని.. పార్టీ ఆవిర్భావ సభ వేదికగా పవన్ కళ్యాణ్ అప్పట్లోనే ఎండగట్టారంటోంది జనసేన. కుల మీటింగుల్లో గంటలు గంటల తరబడి స్పీచ్ ఇవ్వడం.. కుల ఆత్మగౌరవాన్ని ఒకరి కాళ్ల వద్ద తాకట్టు పెట్టి మంత్రి పదవులు పొందింది వైసీపీ నాయకులు అంటున్నారు జనసేనలు. మీరు అసలు కాపులేనా అని ప్రశ్నిస్తోంది.

మొత్తానికి ఏపీలో రెండేళ్లు ముందే కులాలు, బీప్‌ పాలిటిక్స్‌ మొదలయ్యాయి. ఇది ఎన్నికల దాకా కొనసాగే అవకాశం ఉంది. ఇంతకీ పవన్‌ కల్యాణ్‌ను కావాలని వైసీపీ రెచ్చగొడుతుందా? జనసేనలు కూడా హద్దులు మీరుతున్నారా? ఎవరి లక్ష్యం ఏంటి?

– బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్.

ఇదే అంశానికి సంబంధించి ఇవాళ్టి బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ విత్ రజనీకాంత్‌లో డిబేట్ నిర్వహించారు. ఆ లైవ్ వీడియో దిగువన చూడండి..