Solar Eclipse: ఏప్రిల్ 30న తొలి సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా..? నాసా శాస్త్రవేత్తలు ఏమంటున్నారు..?
Solar Eclipse: ప్రతి ఏడాది సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు సంభవిస్తుంటాయి. ఇలాంటి గ్రహణాలలో ప్రత్యేక నియమాలు పాటిస్తుంటారు. ఇక తొలి సూర్యగ్రహణం ఈ ఏప్రిల్..
Solar Eclipse: ప్రతి ఏడాది సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు సంభవిస్తుంటాయి. ఇలాంటి గ్రహణాలలో ప్రత్యేక నియమాలు పాటిస్తుంటారు. ఇక తొలి సూర్యగ్రహణం ఈ ఏప్రిల్ (April) 30, 2022న ఏర్పడనుంది. అయితే భారత్ (India)లో కనిపించే తొలి సూర్యగ్రహణానికి అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. మతపరమైన విశ్వాసాలతో ఇంకొంతమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్యగ్రహణం ఎక్కడ..? ఏ సమయంలో ఎలా కనిపించనుందనే వివరాలను నాసా వెల్లడించింది. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం మరో మూడు రోజుల్లో ఏర్పడనుంది. ఇది తొలి పాక్షక సూర్యగ్రహణం. దక్షిణ అమెరికాలోని దక్షిణాధి ప్రజలు, అంటార్కికా, దక్షిణ మహా సముద్ర ప్రాంతాల వాసులు ఏప్రిల్ 30న సూర్యాస్తమయానికి కొద్దిముందు పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు. ఇక చిలీ, ఉరుగ్వే, పశ్చిమ పర్వాగ్వే, అర్జెంటీనీ, నైరుతి బొలీవియా, ఈశాన్యలోని పెరూ, నైరుతి బ్రెజిల్ దేశాలలో అకాశం నిర్మలంగా ఉంటే.. సూర్యాస్తమయం సమయంలో పాక్షిక సూర్యగ్రహణం కనిపించనుందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే భారతదేశంలో మాత్రం ఈ సూర్యగ్రహణం కనిపించదని నాసా తెలిపింది. దక్షిణ, అమెరికాలోని సౌత్ ఈస్టర్న్ ప్రాంతాల్లో, దక్షిణ పసిపిక్ మహా సముద్ర ప్రాంతాల వాసులకు ఈ సూర్యగ్రహణం కనిపించనుంది.
సూర్యగ్రహణం అంటే ఏమిటి..?
శాస్త్రవేత్తల ప్రకారం.. సూర్యునికి, భూమికి మధ్య చంద్రుడు వెళ్లినప్పుడు, చంద్రుడు సూర్యుని కాంతిని భూమిని చేరకుండా కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో సూర్యుడి నీడ కనిపించదు. ఇదిలా ఉండగా.. సూర్య గ్రహణాన్ని కొందరు అశుభకరంగా భావిస్తారు. అందుకే గ్రహణం సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. దేవాలయాలు కూడా పూర్తిగా మూసివేస్తారు పాక్షిక సూర్యగ్రహణమైతే.. సూర్యునికి చంద్రునికి సరిగ్గా మధ్యలో చంద్రుడి స్థితి ఉండదు. దాంతో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా అడ్డుకోడు.ఇది పూర్తిగా చంద్రుడు సూర్యుడిని ఎంతభాగం కవర్ చేశాడనేదానిపై ఆధారపడి ఉంటుంది. సంపూర్ణ సూర్యగ్రహణమైతే..సూర్యుడు, చంద్రుడు, భూమి..మూడూ సమాంతర రేఖపై ఉంటాయి.
సూర్యగ్రహణం ఎప్పుడు కనిపిస్తుంది?
ఈసారి ఏప్రిల్ 30వ తేదీ శనివారం మధ్యాహ్నం 12.15 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది. ఇక మే 1న ఉదయం 04:07 గంటలకు ముగుస్తుంది. విశేషమేమిటంటే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ సూర్యగ్రహణం సంభవించే సమయంలో, భారతదేశంలో రాత్రి అవుతుంది. భారతదేశ ప్రజలు దానిని చూడలేరు.
గ్రహణాన్ని నేరుగా చూడవచ్చ..
సూర్యగ్రహాన్ని సంపూర్ణంగా ఉన్నా.. పాక్షికంగా ఉన్నా.. నేరుగా సూర్యుడిని చూడకూడదని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని కోసం సోలార్ ఫిల్టర్ అవసరం. టెక్నాలజీతో కూడిన పరకరాల సహాయంగా చూడవచ్చు.పాక్షిక సూర్యగ్రహణం వీక్షించేటప్పుడు ప్రత్యేకమైన కళ్లజోడు ధరించాలి. ఇవి రెగ్యులర్ కళ్లజోడుకు భిన్నంగా ఉంటాయి. ఒకవేళ మీకు అందుబాటులో అవి లేకపోతే.. పిన్ హోల్ ప్రోజెక్టర్ ద్వారా చూడవచ్చు.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: