OnePlus: భారత మార్కెట్‌లోకి మరో రెండు OnePlus 5జీ ఫోన్లు.. రిలీజ్‌కు ముందే లీకైన ధర, ఫీచర్లు.. ఎలా ఉన్నాయంటే?

OnePlus త్వరలో భారత మార్కెట్లోకి రెండు హ్యాండ్‌సెట్‌లను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. అయితే, లాంచ్‌కు ముందే ఈ రెండు డివైజ్‌ల ధర, ఫీచర్లు నెట్టింట్లో లీకయ్యాయి. కాగా, ఇప్పటివరకు ఈ బ్రాండ్‌లో అత్యంత చౌకైన ఫోన్ ఇదే కానుందని తెలుస్తోంది.

OnePlus: భారత మార్కెట్‌లోకి మరో రెండు OnePlus 5జీ ఫోన్లు.. రిలీజ్‌కు ముందే లీకైన ధర, ఫీచర్లు.. ఎలా ఉన్నాయంటే?
Oneplus 10r 5g
Follow us
Venkata Chari

|

Updated on: Apr 27, 2022 | 7:59 AM

OnePlus త్వరలో భారతదేశంలో రెండు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయబోతోంది. ఈ రెండు ఫోన్లను తక్కువ ధరల్లోనే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 28న భారతదేశంలో OnePlus 10R 5G, OnePlus Nord CE 2 Lite 5Gలను విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటితోపాటు బ్రాండ్ వన్‌ప్లస్ బడ్స్‌ను కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ రెండు హ్యాండ్‌సెట్‌ల ధర లాంచ్‌కు ముందు నెట్టింట్లో లీక్ అయ్యాయి. తాజా లీక్‌లో ఈ రెండు హ్యాండ్‌సెట్‌ల ధరలతోపాలు, కలర్లు, ఫీచర్లు కూడా వెల్లడయ్యాయి. OnePlus 10R 5G స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 8100-MAX ప్రాసెసర్‌తో రావచ్చని తెలుస్తోంది. మరోవైపు, OnePlus Nord CE 2 Lite స్మార్ట్‌ఫోన్ 64MP AI ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రానున్నాయని టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ పేర్కొన్నాడు. 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

OnePlus 10R 5G ధర..

OnePlus 8GB RAM + 128GB స్టోరేజ్, 12GB RAM + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో లాంచ్ చేయనున్నట్లు లీక్‌లలో పేర్కొన్నారు. ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ. 38,999 కాగా, దాని టాప్ వేరియంట్ రూ. 44,999కి అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక బేస్ మోడల్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానుండగా, దాని టాప్ వేరియంట్ 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో విడుదల కానుంది.

OnePlus Nord CE 2 Lite 5G ధర..

ఈ ఫోన్ కూడా రెండు కాన్ఫిగరేషన్లలో లాంచ్ అవుతుంది. OnePlus Nord CE 2 Lite 5G 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 17,999లో రిలీజ్ కానుంది. అదే సమయంలో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 19,999కి అందుబాటులోకి రానుంది. ఈ రెండు ఫోన్లతో బ్రాండ్ OnePlus Nord Budsని కూడా భారత మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. దీని ధర రూ. 2999గా ఉండొచ్చని లీకులు చెబుతున్నాయి.

ఫీచర్లు..

కంపెనీ ఇప్పటికే OnePlus 10R 5Gని OnePlus ACE పేరుతో చైనాలో విడుదల చేయనుంది. ఈ ఫోన్ ఈ ఏడాది మార్చిలో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిన రియాలిటీ GT నియో 3కి రీబ్రాండెడ్ వెర్షన్. ఈ ఫోన్ త్వరలో భారతదేశంలో లాంచ్ కానుంది. మరోవైపు, OnePlus Nord CE 2 Lite 6.59-అంగుళాల స్క్రీన్‌తో రానుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మద్దతుతో ఇస్తుంది. 64MP మెయిన్ లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఫోన్‌లో ఉండనుంది. హ్యాండ్‌సెట్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 33W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Smart Water Bottle: మార్కెట్లోకి స్మార్ట్‌ వాటర్‌ బాటిల్ వచ్చేశాయి.. ఫీచర్లు తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..

QR Code Alert: మీరు QR కోడ్‌తో లావాదేవీలు జరిపితే జాగ్రత్తగా ఉండండి.. ఈ తప్పులు చేస్తే మీ బ్యాంకు ఖాతా ఖాళీయే..!