Andhra Pradesh: బిల్లులు చెల్లించలేదని సచివాలయానికి తాళం.. కాంట్రాక్టర్ నిరసన

కడప జిల్లా(Kadapa district) ఖాజీపేట మండలం అప్పన్నపల్లి పంచాయతీలోని గ్రామ సచివాలయానికి కాంట్రాక్టర్ తాళం వేశారు. సచివాలయ భవనం నిర్మించి రెండేళ్లు అవుతున్నా అధికారులు బిల్లులు చెల్లించలేదనే కారణంతో...

Andhra Pradesh: బిల్లులు చెల్లించలేదని సచివాలయానికి తాళం.. కాంట్రాక్టర్ నిరసన
Schivalayam
Follow us

|

Updated on: Apr 27, 2022 | 1:58 PM

కడప జిల్లా(Kadapa district) ఖాజీపేట మండలం అప్పన్నపల్లి పంచాయతీలోని గ్రామ సచివాలయానికి కాంట్రాక్టర్ తాళం వేశారు. సచివాలయ భవనం నిర్మించి రెండేళ్లు అవుతున్నా అధికారులు బిల్లులు చెల్లించలేదనే కారణంతో గుత్తేదారు వాసుదేవరెడ్డి ఇవాళ ఉదయం సచివాలయానికి తాళం వేశారు. రూ.48 లక్షలతో సచివాలయం నిర్మించినట్లు చెప్పారు. రెండేళ్లు అవుతున్నా పంచాయతీ అధికారులు బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాసుదేవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిగా బిల్లులు చెల్లించకుండా.. అధికారులు తిప్పించుకుంటున్నారని, దీంతో చేసేదేమీ లేక ఇలా చేయాల్సి వచ్చిందన్నారు. అధికారులు బిల్లులు చేయకపోవడంతో నిధులు విడుదల కావడం లేదని కాంట్రాక్టర్ తెలిపారు. అధికారులకు ఇవ్వాల్సిన 5% కమిషన్ ఏడాదిన్నర కిందట ఇచ్చినా స్పందన లేదని వెల్లడించారు.

తనకు బిల్లులు చెల్లించే వరకు సచివాలయం తలుపులు తెరిచే ప్రసక్తే లేదని వాసుదేవరెడ్డి తేల్చి చెప్పారు. దీంతో సచివాలయానికి విధుల నిర్వహణకు వచ్చిన ఉద్యోగులు సమీపంలోని చెట్ల కింద కూర్చున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లికి చేయండి

Also Read

Summer Food Tips: ఎండలతో ఆహార పదార్థాలు పాడైపోతున్నాయా.? ఇలా చేయండి తాజాగా ఉంటాయి!

Viral Video: మొసలి, కొండ చిలువల మధ్య భీకర పోరు.. చివరికి జరిగింది, ఎవరూ ఊహించనిది..