Viral Video: మొసలి, కొండ చిలువల మధ్య భీకర పోరు.. చివరికి జరిగింది, ఎవరూ ఊహించనిది..

Viral Video: ఈ సృష్టిలో మనుగడ సాధించాలంటే కచ్చితంగా శత్రువును ఓడించాల్సిందే. చరిత్ర మనకు చెప్పిన సత్యం ఇదే. అస్తిత్వం కోసం, ఆహారం కోసం.. ఇలా ప్రతీ క్షణం జీవుల మధ్య పోరు సాగుతూనే ఉంటుంది...

Viral Video: మొసలి, కొండ చిలువల మధ్య భీకర పోరు.. చివరికి జరిగింది, ఎవరూ ఊహించనిది..
Representative Image
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 27, 2022 | 1:07 PM

Viral Video: ఈ సృష్టిలో మనుగడ సాధించాలంటే కచ్చితంగా శత్రువును ఓడించాల్సిందే. చరిత్ర మనకు చెప్పిన సత్యం ఇదే. అస్తిత్వం కోసం, ఆహారం కోసం.. ఇలా ప్రతీ క్షణం జీవుల మధ్య పోరు సాగుతూనే ఉంటుంది. ఒకదానిపై మరొకటి పోరు చేస్తూనే ఉంటాయి. ఒక జీవి స్థావరం ఏర్పాటు చేసుకున్న ప్రాంతానికి మరో జీవి వస్తే దానిని మనుగడకే ప్రమాదకరంగా భావించి దాడులు చేస్తుంటాయి. అయితే ఈ పోరు రెండు సమానమైన బలం ఉన్న జీవుల నడుమ జరిగే పోరు కచ్చితంగా భయానకంగా ఉంటుంది. ఇలాంటి భీకరమైన పోరులకు సంబంధించిన వీడియోలు ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్‌ అవుతోంది. మొసలి, పైథాన్‌ల నడుమ జరిగిన పోరుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఒక సరస్సులో మొసలి, కొండ చిలువలు తారసపడ్డాయి. దీంతో కొండ చిలువ మొదట నెమ్మదిగా మొసలి వద్దకు వెళ్లింది. అన్నింటిని అవలీలగా మింగేస్తాను నాకేంటి అన్నట్లుగా మొసలిని కూడా మింగేద్దామని పెద్దగా నోరు తెరిచి దాడికి దిగింది పైథాన్‌. కానీ మొసలికి సాధారణమైన బలం ఉంటుందా చెప్పండి. వెంటనే పైథాన్‌ను గట్టిగా నోటిన కరిచేసింది. ఇక పైథాన్‌ పని అయిపోయింది, మొసలికి ఆహారంగా మారిపోతుందని భావించే సమయంలోనే పైథాన్‌ మళ్లీ పై చేయి సాధించింది.

వెంటనే మొసలిని చుట్టేసి గట్టిగా బిగించేసింది. దీంతో మొసలికి అసలు విషయం అర్థమైపోయింది. ఇంకాసేపు పైథాన్‌ అలాగే చుట్టేస్తే తన పని అయిపోతుందని భావించి వెంటనే పామును వదిలేసింది. దీంతో పైథాన్‌ అక్కడి నుంచి పక్కకు తప్పుకుంది. అయితే మొసలి మరోసారి అటాక్‌ చేయడానికి ముందుకు రాగానే పైథాన్‌.. చూసుకుందాంరా అన్నట్లు అగ్రెసివ్‌గా ముందుకు వెళ్లింది. దీంతో మొసలి వెనుకడుగు వేసి అక్కడి పారిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ భీకర పోరుకు సంబంధించిన వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

మరిన్ని వైరల్ వీడియోలకు క్లిక్ చేయండి..

Also Read: బుల్డోజర్ అసలు పేరు మీకు తెలుసా?

Viral Video: అమ్మ ప్రేమ కదా ఇలానే ఉంటుంది.. ప్రమాదంలో ఏం జరిగిందంటే..

Chirutha-Python video: చిరుత‌పులి, కొండ‌చిలువ మ‌ధ్య ఫైట్‌..! ఒళ్ళు గగుర్పొడిచే షాకింగ్ వీడియో..