Viral Video: అమ్మ ప్రేమ కదా ఇలానే ఉంటుంది.. ప్రమాదంలో ఏం జరిగిందంటే..

ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది మాతృ వాత్సల్యం. తల్లి తన బిడ్డ కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఎల్లప్పుడూ తన పిల్లల భద్రత, భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటుంది.

Viral Video: అమ్మ ప్రేమ కదా ఇలానే ఉంటుంది.. ప్రమాదంలో ఏం జరిగిందంటే..
Mother Save His Kid
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 27, 2022 | 9:54 AM

ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది మాతృ వాత్సల్యం. తల్లి తన బిడ్డ కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఎల్లప్పుడూ తన పిల్లల భద్రత, భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటుంది. ఆమె తన బిడ్డను తనకంటే ఎక్కువగా చూసుకుంటుంది. ఇది మనందరికీ అమ్మ నుంచి లభించే ఆప్యాయత. ఇందుకు నిదర్శనంగా తాజాగా ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన బిడ్డను క్షణాల్లో ప్రమాదం నుంచి కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా(Viral Video) మారింది. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను హత్తుకుంది. తల్లి చేసిన సహాసం చూసి వారిని ఫ్లెక్సిబుల్ చేసింది.

ఈ వీడియో పెద్ద ఎత్తున సంచలనంగా మారుతోంది. అది కారు డాష్ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో ఇది. ఈ వీడియోలోని కంటెంట్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోలో తండ్రి, తల్లి, బిడ్డగా ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వెళ్తున్నారు.

వీరు ఓ హైవేపై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెనక నుంచి వచ్చిన కారు వీరి బైక్‌ను జస్ట్ తగిలిస్తూ ముందుకు వెళ్లింది. అయితే ఈ సందర్భంలో బైక్ అనూహ్యంగా స్కిడ్ అయ్యింది.  దాంతో బైక్ పై ఉన్న రైడర్ కాస్త ఊగిపోయాడు. అందులో తల్లి, బిడ్డ బైక్‌పై నుంచి కిందపడ్డారు. బైక్‌పై ఉన్న ముగ్గురిలో తల్లికొడుకు కింద పడిపోయారు. వీరు కింద పడిన వెంటనే ఎదురుగా వస్తున్న లారీ కింద పడే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

అయితే కొడుకునే కాపాడుకునే ప్రయత్నంలో తల్లి చేసిన సాహసం అద్భుతం. అమ్మ చేసిన తెగువును మెచ్చుకోని నెటిజన్లు ఉండరంటే నమ్మండి. అంతలా అమ్మ తన కొడుకును కాపాడింది. బైక్ నుంచి కిందపడిపోయిన వెంటనే లారీ కిందికి వెళ్లారు.. ముందుగా కొడుకు లారీ టైర్ల కిందికి వెళ్తుండగా తల్లి అతడిని తన వైపు లాగేసింది. అక్కడ జరిగిన ద‌ృశ్యాలను ఈ కింది వీడియోలో చూడవచ్చు..

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో తన కొడుకు కోసం తల్లి చేసిన సాహసాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోను వేడ్ 10కెలో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన వెంటనే నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది.

ఇవి కూడా చదవండి: తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం.. ఆలయంలో సమీపంలో చెలరేగిన మంటలు.. 11 మంది భక్తులు సజీవదహనం

TRS Plenary: గులాబీ మయమైన హైదరాబాద్.. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ స్వాగత ఉపన్యాసం