Viral Video: ప్రకృతి చేసే వింతలు ముందు మనమెంత..? చెట్టునుంచి ధారాళంగా నీరు.. చుస్తే షాక్ అవ్వాల్సిందే..
ప్రకృతి ఎన్నో వింతలు, విశేషాలతో కూడుకున్నది. సాధారణంగా చెట్లనుంచి పాలు, జిగురు లాంటివి రావడం మనం చూసాం. వేప, తుమ్మ చెట్లనుంచి జిగురు వస్తుంది... జిల్లేడు లాంటి కొన్ని చెట్లనుంచి పాలు వస్తాయి.
ప్రకృతి ఎన్నో వింతలు, విశేషాలతో కూడుకున్నది. సాధారణంగా చెట్లనుంచి పాలు, జిగురు లాంటివి రావడం మనం చూసాం. వేప, తుమ్మ చెట్లనుంచి జిగురు వస్తుంది… జిల్లేడు లాంటి కొన్ని చెట్లనుంచి పాలు వస్తాయి. కానీ ఇక్కడ ఓ చెట్టునుంచి నీరు వస్తోంది… అదికూడా ఏదో కొద్దిపాటి నీరు కాదు..చెట్టు బెరడు తొలగించగానే ఫుల్ ప్రెజర్‌తో నీరు ఎగజిమ్ముతోంది. ఈ చెట్టుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టెర్మినలియా టొమెంటోసా అనే ఈ చెట్టును సాధారణ భాషలో మొసలి బెరడు చెట్టు అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని కొన్ని ఎత్తైన ప్రదేశాల్లో కనిపిస్తుంది. ఈ చెట్టు 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ చెట్టు తొర్ర స్వచ్ఛమైన నీటితో నిండి ఉంటుంది. అదే దీని ప్రత్యేకత. ఇవి తమిళనాడు అడవుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడి గిరిజనులు ఈ చెట్లనుంచి వచ్చే నీటిని తాగుతారు. ఈ చెట్టుకు గాటు పెడితే దాదాపు ఒక లీటరు నీరు బయటకు వస్తుంది. అటవీ శాఖాధికారులు, జీవ శాస్త్రవేత్తలు కూడా దీని వెనుక కారణాన్ని కనుగొనలేకపోయారు. స్థానిక భాషలో, ఈ చెట్టును అస్నా, సజ్ పేర్లతో పిలుస్తారు. బౌద్ధులు దీనిని బోధి చెట్టు అని పిలుస్తారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ చెట్టు వీడియోను లక్షలమంది వీక్షిస్తూ లైక్ చేస్తున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోను మీరూ వీక్షించండి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్ స్టార్ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..
viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..
Viral Video: రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

