Viral Video: రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ఎవ్వరూ ఊహించలేరు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఎదుటి వారు జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం తప్పదు. తాజాగా జరిగిన ఓ ఘటన గగుర్పాటుకు గురి చేస్తోంది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీ కొట్టింది.
ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ఎవ్వరూ ఊహించలేరు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఎదుటి వారు జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం తప్పదు. తాజాగా జరిగిన ఓ ఘటన గగుర్పాటుకు గురి చేస్తోంది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తిని లారీ కొంత దూరం ఈడ్చుకెళ్లిపోయింది. ప్రమాదం దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. తూర్పుగోదావరిజిల్లా రాజానగరం జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దివాన్ చెరువు శ్రీరామపురం ప్రాంతానికి చెందిన మాదారపు వెంకటేశ్వరరావు.. ద్విచక్రవాహనంపై దివాన్ చెరువు కూడలి నుంచి పాలచర్ల వైపు వెళ్తున్నాడు. రోడ్డు దాటుతున్న సమయంలో రాజానగరం వైపు నుంచి వస్తున్న లారీ బైక్ ను ఢీకొట్టింది. అంతేకాకుండా కొంతదూరం ఈడ్చుకుంటూ పోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ట్రాఫిక్ పోలీసులు లేకపోవడం విచారకరం. విశాఖపట్నం నుంచి హైదరాబాద్, ఖమ్మం, విజయవాడ వెళ్లే భారీ వాహనాలు ఈ మార్గంలోనే ప్రయాణిస్తాయి. హైవే కి ఆనుకుని ఉన్న మారుమూల గ్రామాల నుండి పొలం పనులకు, ఇతర గ్రామాలకు ఈ హైవే మీదుగానే వెళుతుంటారు.. కానీ అక్కడ సిగ్నల్ కూడా పనిచేయడంతో స్థానిక ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!
మత్స్యకారులకు ముందే వచ్చిన ఉగాది.. వలలో చిక్కిన భారీ చేప
కోనసీమలో 'మూకుడు రొట్టె'కు పెరిగిన డిమాండ్!
మున్సిపాలిటీ వాటరే కదా అని కార్లు కడుగుతున్నారా? జాగ్రత్త!
సిలిండర్ తీసుకున్నారు సరే..మరి రశీదు ఏది?
నటి శ్రీదేవి ఆస్తుల వివాదం.. కోర్టుకెక్కిన బోనీ కపూర్
ఫ్లయిట్లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

