AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం.. ఆలయంలో సమీపంలో చెలరేగిన మంటలు.. 11 మంది భక్తులు సజీవదహనం

తమిళనాడు తంజావుర్​లో ఘోర ప్రమాదం జరిగింది. కరిమేడు అప్పర్​ ఆలయ రథం విద్యుత్ తీగకు తగిలి 11 మంది సజీవదహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రథాల పండగలో ..

తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం.. ఆలయంలో సమీపంలో చెలరేగిన మంటలు.. 11 మంది భక్తులు సజీవదహనం
Thanjavur Big Temple Chario
Sanjay Kasula
|

Updated on: Apr 27, 2022 | 8:51 AM

Share

తమిళనాడు తంజావుర్​లో(thanjavur) ఘోర ప్రమాదం జరిగింది. కరిమేడు అప్పర్​ ఆలయ రథం విద్యుత్ తీగకు తగిలి 11 మంది సజీవదహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రథల పండగలో పాల్గొన్న రథం గుడికి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. నిన్న రాత్రి తంజావూరు సమీపంలోని కలిమెట్‌లో 94వ ఎగువ గురుపూజ చిత్రై ఉత్సవం జరిగింది. అనంతరం ఆ ప్రాంత భక్తులు తాడు పట్టుకుని రథంను లాగారు. రథం తిరగబడటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరగబడిన వెంటనే రథంపైకి వెళ్లిన హైవోల్టేజీ విద్యుత్ లైన్‌ను తగిలింది. రథం లాగుతున్న భక్తులపై  కరెంటు తీగలు పడ్డాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అక్కడిక్కడే 11 మంది చనిపోయారు. మరో పది మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఓకే కుటుంబానికి చెందిన నలుగు చనిపోయారు.

వెయ్యి సంవత్సరాల పురాతనమైన..

తంజావూరు పెద్ద దేవాలయం వెయ్యి సంవత్సరాల పురాతనమైన అద్భుతమైన దేవాలయం. వాస్తుశిల్పానికి ఉదాహరణగా ఈ ఆలయం ప్రపంచ వారసత్వ ప్రదేశం. తమిళులే కాకుండా రాష్ట్రం నలుమూలల నుండి విదేశీ పర్యాటకులు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఈ మహిమాన్వితమైన ఆలయం భక్తులకు దర్శనం లభించలేదు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. వేలాది మంది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.. అక్కడికి వచ్చిన భక్తులు రథం లాగేందుకు పోటీ పడ్డారు.

ఇవి కూడా చదవండి: Prashant Kishor: కాంగ్రెస్‌కు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్.. లాస్ట్ మినెట్‌లో కీలక ప్రకటన..!

Railway News: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. పలు రూట్లలో రైళ్ల పునరుద్ధరణ..