TRS Plenary: గులాబీ మయమైన హైదరాబాద్.. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ స్వాగత ఉపన్యాసం
టీఆర్‌ఎస్ ఆవిర్భావోత్సవానికి హైదరాబాద్ గులాబీ మయంగా మారింది. ఎటు చూసినా.. ఎక్కడ చూసినా గులాబీ జెండాలు, బ్యానర్లు, కటౌంట్లు దర్శనమిస్తున్నాయి. అలంకరణ తోరణాలు, బ్యానర్లతో..
టీఆర్ఎస్(TRS) ఆవిర్భావోత్సవానికి హైదరాబాద్ గులాబీ మయంగా మారింది. ఎటు చూసినా.. ఎక్కడ చూసినా గులాబీ జెండాలు, బ్యానర్లు, కటౌంట్లు దర్శనమిస్తున్నాయి. అలంకరణ తోరణాలు, బ్యానర్లతో కొత్త కళ సంతరించుకుంది. అదే స్థాయిలో సమావేశాలకు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10 గంటలకు మొదలయ్యే సమావేశం… హైదరాబాద్ HICCలో జరుగుతోంది. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ పార్టీకి కీలకం కానుంది. ఈ వేధిక నుంచే 2023 ఎన్నికల వ్యూహాన్ని రచించనున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. దేశ రాజకీయాలపైనా కూడా బ్లూ ప్రింట్‌ను ఆవిష్కరించునున్నారు.
వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలుండటం.. ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు.. ప్రశాంత్ కిశోర్ ఎంట్రీ.. కేంద్రంతో పోరు.. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం.. వంటి అంశాల మధ్య ఈ ప్లీనరీ జరుగుతోంది. దీంతో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ మహాసభ జరగనుంది.
ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఈ ప్లీనరీ తీర్మానాలు ఉండేలా తెలుస్తోంది. మొత్తం 11 తీర్మానాలను ప్రవేశ పెట్టనున్నారు. వీటిలో మూడు రాజకీయ తీర్మానాలు ఉండబోతున్నాయ్. తెలంగాణపై కేంద్రం వివక్ష, జాతీయ ప్రత్యామ్నాయ వేదిక, లేదా కొత్త పార్టీ. ఇక దేశ పాలనలో కేంద్ర వైఫల్యాలు.. వంటి అంశాలపై ఈ మూడు తీర్మానాలు ఉండబోతున్నాయ్. వీటితో పాటు టీఆర్ఎస్ అభివృద్ధి, సంక్షేమం, దళిత బంధు, భారీగా ఉద్యోగ నియామకాలు, విజయాలు, పురస్కారాలు తదితర అంశాలపై మిగిలిన తీర్మానాలుంటాయని సమాచారం.
మొత్తంగా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగు పెట్టే విధానం ఎలాంటిది? మూడో కూటమి ఏర్పాటు చేస్తారా? లేక కొత్త జాతీయ పార్టీ పెడతారా? ఇవన్నీ కాక.. ఎన్నికల తర్వాత కలిసొచ్చే పార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? కేసీఆర్ ఢిల్లీకి వెళ్తే.. ఇక్కడ కేటీఆర్ సీఎం అవుతారా? ఒక వేళ అదే జరిగితే.. ఎప్పుడు? ఎన్నికల ముందా- తర్వాతా? ఇలా క్యాడర్లో ఎన్నో ప్రశ్నలు. వీటన్నిటికీ ఈ ఆవిర్భావ సదస్సు ద్వారా స్పష్టత వచ్చేనా? సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి: Prashant Kishor: కాంగ్రెస్‌కు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్.. లాస్ట్ మినెట్‌లో కీలక ప్రకటన..!
Railway News: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. పలు రూట్లలో రైళ్ల పునరుద్ధరణ..