AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: చంద్రబాబుకు ఇచ్చిన నోటీసు చెత్త కాగితంతో సమానం.. బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్య

సీఎం జగన్(CM Jagan) ను విజయసాయిరెడ్డి బ్లాక్ మెయిల్ చేయడం వల్లే.. ఆయనకు అందరి కంటే పెద్ద పదవి ఇచ్చారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. విజయసాయి రెడ్డిని జగన్ పక్కన పెట్టేశారని వైసీపీ నేతలే(YCP Leaders) అంటున్నారని..

Andhra Pradesh: చంద్రబాబుకు ఇచ్చిన నోటీసు చెత్త కాగితంతో సమానం.. బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్య
Budda Venkanna
Ganesh Mudavath
|

Updated on: Apr 27, 2022 | 1:22 PM

Share

సీఎం జగన్(CM Jagan) ను విజయసాయిరెడ్డి బ్లాక్ మెయిల్ చేయడం వల్లే.. ఆయనకు అందరి కంటే పెద్ద పదవి ఇచ్చారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. విజయసాయి రెడ్డిని జగన్ పక్కన పెట్టేశారని వైసీపీ నేతలే(YCP Leaders) అంటున్నారని చెప్పారు. విజయసాయిరెడ్డికి ఉన్నట్టుండి కీలక బాధ్యతలు అప్పగించారంటే ఇందుకు బ్లాక్ మెయిలే కారణమని వివరించరాు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు(Chandrababu) నోటీసులిస్తే జగన్ వద్ద మార్కులు కొట్టెయ్యవచ్చని వాసిరెడ్డి పద్మ భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు నోటీసులిచ్చేందుకు వాసిరెడ్డి పద్మ స్థాయేంటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఇచ్చిన నోటీసు చెత్త కాగితంతో సమానమని సంచలన కామెంట్ చేశారు. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మను తప్పించాలని.. అధికారులు, పోలీసులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. మహిళలపై జరుగుతోన్న దాడులకు నిరసనగా తన ఇంటివద్ద బుద్దా వెంకన్న నేతృత్వంలో చేపట్టిన ఆందోళనలో వాసిరెడ్డి పద్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి సీఎం జగన్.. పార్టీ అనుబంధ విభాగాల సమన్వయ బాధ్యతలతో పాటు అదనంగా మరిన్ని పార్టీ బాధ్యతలు అప్పగించారు. రీజినల్‌ కో- ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షుల సమన్వయ బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్యే, మీడియా కో-ఆర్డినేషన్‌ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కేటాయించారు. ఈ నెల 19న జారీ చేసిన ఉత్తర్వులను మార్చుతూ సీఎం కొత్త ఆదేశాలు జారీ చేశారు. గతంలో విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి బాధ్యతలు చూశారు. అయితే.. ఇటీవల కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత ఆ బాధ్యతల నుంచి విజయసాయి రెడ్డిని తప్పించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లికి చేయండి

ఇవీచదవండి

Viral Video: మొసలి, కొండ చిలువల మధ్య భీకర పోరు.. చివరికి జరిగింది, ఎవరూ ఊహించనిది..

Viral Video: మొదటి సారి భారతీయ ఆహారాన్ని రుచి చూసిన అమ్మాయి.. చివరకు ఏం చేసిందంటే..