ఎపిలో కరోనా వారియర్స్ కు చంద్రబాబు పొగడ్తలు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరోనా విషయంలో చేతులు ఎత్తివేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఏపీలో కరోనా కేసులను అదుపు చేయలేకపోతున్నారని ఆయన అన్నారు. కరోనా వారియర్స్ మాత్రం..

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరోనా విషయంలో చేతులు ఎత్తివేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఏపీలో కరోనా కేసులను అదుపు చేయలేకపోతున్నారని ఆయన అన్నారు. కరోనా వారియర్స్ మాత్రం అగ్రభాగాన నిలబడి పోరాడుతున్నారని చంద్రబాబు కితాబివ్వడం విశేషం. హాస్పిటల్స్ బాధితులకు బెడ్లు దొరకడం లేదని, ప్రైవేటు ఆస్పత్రులలో ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు వసూలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. కరోనా వల్ల ఆర్దిక వ్యవస్థ చిన్నా భిన్నం అయిందని, చేతివృత్తుల వారు దెబ్బతిన్నారని చెప్పుకొచ్చారు. పేదలకు నెలకు పదివేల రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లించాలని బాబు డిమాండ్ చేశారు. కరోనా బాధితులతోపాటు, కొందరు వైద్యులతో ఇవాళ చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.



