AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan Birthday: సీఎం జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌.. ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలంటూ..

సోషల్ మీడియా వేదికగాను ప్రముఖులంతా జగన్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, సినిమా తారలు.. తదితర రంగాలకు చెందిన ప్రముఖులు సీఎంకు విషెస్‌ తెలుపుతున్నారు.

CM Jagan Birthday: సీఎం జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌.. ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలంటూ..
Chandrababu, Cm Jagan,pawan
Basha Shek
|

Updated on: Dec 21, 2022 | 2:48 PM

Share

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు జగన్‌ బర్త్‌ డే కేక్‌లు కట్‌ చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మంత్రులు, పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో పలు చోట్ల ప్రత్యేక రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. వృద్ధులకు, రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగాను ప్రముఖులంతా జగన్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, సినిమా తారలు.. తదితర రంగాలకు చెందిన ప్రముఖులు సీఎంకు విషెస్‌ తెలుపుతున్నారు. ఈక్రమంలో  టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. అలాగే జనసేనాని పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను’ అని ట్విట్టర్‌ వేదికగా విషెస్‌ తెలిపారు పవన్‌.

కాగా రాష్ట్రవ్యాప్తంగా జగన్‌ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బాపట్ల జిల్లాలో ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరు వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో 175/175 జగనన్న పేరుతో వరి పొలంలో పంటను కోయించి అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ ఆధ్వర్యంలో ఆరు వందల కేజీల భారీ కేక్‌ను కట్‌చేసి సీఎం జగన్‌కు బర్త్‌డే విషెష్ చెప్పారు వైసీపీ లీడర్స్‌. విజయవాడ గొల్లపూడిలో డప్పు వాయిద్యాల మధ్య భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం.. తలశిల రఘురామ్‌, వసంత వెంకటకృష్ణప్రసాద్‌, సామినేని ఉదయభాను, వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, ఎంపీ నందిగం సురేష్‌ కలిసి కేక్‌ను కట్‌ చేశారు. ఇక నగరిలో సైతం జగన్‌ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నగరి ఎంపీడీవో కార్యాలయంలో డ్వాక్రా సంఘాల మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అలాగే రాజమండ్రిలో 14వేల మంది విద్యార్ధులకు ఆల్‌ఇన్‌వన్‌ పుస్తకాలను పంపిణీ చేశారు. హ్యాపీ బర్త్‌డే సీఎం సార్‌ అంటూ కేరింతల మధ్య ర్యాలీ నిర్వహించారు స్టూడెంట్స్‌. పులివెందులలో కడప ఎంపి అవినాష్ రెడ్డి సీఎం జగన్ పై రూపొందించిన పాటను ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్