Sattenapalle: అరె పత్తి భలే పండిందే అనుకునేరు.. లోపలికి వెళ్లి చెక్ చేసి స్టన్ అయిన పోలీసులు.. వామ్మో
ఏపీలో గంజాయి సాగకు చెక్ పెడుతున్నారు అధికారులు. పల్నాడు జిల్లాలో రైతు అంతర్ పంటగా పండిస్తున్న గంజాయిని ద్వంసం చేశారు అధికారులు.

మత్తు వాసన ఏపీని వీడటం లేదు. ఇంతవరకు ఏజెన్సీ ప్రాంతాలకే పరిమతమైన ఈ గంజాయి సాగు ఇప్పుడు రాష్ట్రమంతటా విస్తరించింది. రాష్ట్రంలో యువత పెద్ద ఎత్తున గంజాయికి అలవాటు పడ్డట్లు అనధికారింగా తెలుస్తుంది. దీంతో అధికారులు యువతను చిత్తు చేస్తున్న మత్తు పదార్థాల సప్లై, వినియోగంపై మరింత ఫోకస్ పెంచారు. తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లా గంజాయి వాసన గప్పుమనింది. అత్యాశకు పోయి అడ్డంగా బుక్ అయ్యాడో రైతు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గంజాయి సాగు చేస్తున్న రైతు నిర్వాహకాన్ని వెలుగులోకి తెచ్చారు అధికారులు. పత్తి పంటలో అంతర్ పంటగా గంజాయిని పండిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. పొలాన్ని మొత్తం తనిఖీ చేసి గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు సెబ్ అధికారులు. గంజాయి సాగు చేస్తున్న రైతును అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు.
గంజాయి కోసమే పంటను వేస్తున్నాడా?.. లేక ఎవరైనా చెబితే ఇలా చేశాడా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. నార్కోటిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ ఆదేశించిన 24గంటల్లోనే సెబ్ అధికారులు విసృతస్థాయిలో చర్యలు చేపట్టారు. ఈక్రమంలోనే పల్నాడు జిల్లాలో గంజాయి సాగును అడ్డుకున్నారు.
సీఎం కీలక ఆదేశాలు….
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీని మార్చాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ఎక్కడా మాదక ద్రవ్యాల వినియోగం ఉండకూడదన్నారు. ఎక్సైజ్ శాఖపై ఇటీవల సమీక్ష చేశారు ముఖ్యమంత్రి జగన్. SEB టోల్‌ఫ్రీ నెంబర్‌ని బాగా ప్రచారం చేయాలన్నారు. పోలీస్, ఎక్సైజ్, SEB సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వారంలో ఒకరోజు తప్పనిసరిగా సమావేశం కావాలన్నారు. రాష్ట్రంలో గంజాయి సాగు జరగకుండా చూడాలని, అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..




