AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: తెలుగోడి సాహిత్య సేవకు పట్టం.. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ను గెలుచుకున్న అభ్యుదయ కవి లక్ష్మీ నారాయణ

భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైనది పురస్కారంగా ప్రసిద్దిగాంచిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ 2024 సంవత్సరానికి గాను ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ అందుకోనున్నారు. ఆయన రచించిన "దీపిక అభ్యుదయ వ్యాస సంపుటి"కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ వరించింది. భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైనదిగా ఈ పురస్కారాన్ని కొత్త సంవత్సరంలో దేశరాజధాని ధిల్లీ లో తీసుకోనున్నారు.

Andhra Pradesh: తెలుగోడి సాహిత్య సేవకు పట్టం.. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ను గెలుచుకున్న అభ్యుదయ కవి లక్ష్మీ నారాయణ
Penukonda Lakshminarayana
Surya Kala
|

Updated on: Dec 18, 2024 | 5:54 PM

Share

కేంద్ర ప్రభుతం ఉత్తమ సాహిత్యాన్ని అందించే సృజనాత్మక సాహిత్యవేత్తలకు ప్రతి సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందజేస్తుంది. భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైన  పురస్కారంగా ప్రసిద్దిగాంచిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ 2024 సంవత్సరానికి గాను పలు భాషలకు చెందిన సాహితీ వేత్తల కథలు, కవితలు, సంపుటాలకు ఈ అత్యుత్తమ పురష్కారం అందుకోనున్నారు. తెలుగు భాషలో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకి చెందిన ప్రముఖ కవి, న్యాయవాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ కోసం ఎంపికయ్యారు.

లక్ష్మీ నారాయణ వృత్తి రీత్యా న్యాయవాది. అంతేకాదు ఆయన అభ్యుదయ కవి. శ్రామిక పక్షపాతిగా పేరు గాంచారు. ప్రస్తుతం అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శిగాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగాను పనిచేస్తున్నారు. 2023లో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి తెలుగు సాహితీవేత్తగా గుర్తింపు పొందారు. 1972 నుంచి అభ్యుదయ రచయితల సంఘం కార్యకర్తగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు బాధ్యతలు నిర్వహించారు. 1972లో సమిధ అనే కవితతో తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. వివిధ విమర్శనా గ్రంథాలను, సాహిత్యవ్యాసాల సంపుటి , కవిత్వాన్ని రచించారు. ఇప్పటికే ఆయన తెలుగు భాషాపురస్కారం, సుంకర సత్యనారాయణ స్మారక పురస్కారం, మిలీనియం లాయర్‌ పురస్కారం లను అందుకున్నారు.

లక్ష్మీ నారాయణ జీవిత విశేషాలు

లక్ష్మీ నారాయణ 1954, అక్టోబర్ 24వ తేదీన గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం చెరువుకొమ్ముపాలెం గ్రామంలో గోవిందరెడ్డి, లింగమ్మ దంపతులకు జన్మించారు. మధ్యతరగతి కుటుంబం.. తండ్రి ఓ సామాన్య రైతు.. బిఎ డిగ్రీ చదివిన తర్వాత బీఎల్ చేశారు. గుంటూరులో న్యాయవాద వృత్తిని చేపట్టారు. భార్య పేరు గీత, టీచర్ గా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

దేశ వ్యాప్తంగా ఎన్ని భాషలకు ప్రకటించిందంటే

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 21 భాషలకుగాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను సాహిత్య అకాడమీ ప్రకటించింది. బెంగాలీ, ఉర్దూ, డోగ్రి భాషలకు సంబందించిన అవార్డులను త్వరలో ప్రకటించనున్నారు. పురష్కరాలకు ఎంపికయిన రచయితలకు వచ్చే సంవత్సరం దేశ రాజధాని ధిల్లీలో ఈ పురష్కరాలను అందజేయనుంది. శాలువా తో సన్మానం చేసి ఆ అవార్డు కింద లక్ష రూపాయల నగదును బహుమతిగా అందజేయనున్నారు. ఈ అవార్డ్ కోసం తెలుగు బాష నుంచి మొత్తం 14 పుస్తకాలను సిఫార్స్ చేసినట్లు.. అందులో దీపిక’ అభ్యుదయ సాహిత్య వ్యాస సంపుటిక ఎంపికఅయినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..