IAS officer Krishna Teja: డిప్యుటేషన్‌పై ఏపీకి రానున్న కేరళ యువ ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణ తేజ
కేరళ ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజ ఏపీకి డిప్యుటేషన్‌పై రానున్నారు. ఐఏఎస్ కృష్ణ తేజను డిప్యూటేశన్ పై ఆంధ్రప్రదేశ్‌కు పంపడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేరళ నుంచి ఏపీకి మూడేళ్లపాటు డిప్యుటేషన్‌కు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కృష్ణ తేజ కేరళలోని త్రిసూర్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

అమరావతి, జులై 13: కేరళ ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజ ఏపీకి డిప్యుటేషన్‌పై రానున్నారు. ఐఏఎస్ కృష్ణ తేజను డిప్యూటేశన్ పై ఆంధ్రప్రదేశ్‌కు పంపడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేరళ నుంచి ఏపీకి మూడేళ్లపాటు డిప్యుటేషన్‌కు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కృష్ణ తేజ కేరళలోని త్రిసూర్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కృష్ణ తేజని ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. రెవెన్యూ నుంచి డూప్యూటేషన్ పై జనశక్తి శాఖకు పంపుతూ తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో నాలుగేళ్ల పాటు కొనసాగనున్నారు. కేరళలో సమర్థుడైన ఐఏఎస్ అధికారిగా కృష్ణతేజకు మంచి పేరు ఉంది.
ఐఏఎస్ కొలువు సొంతం చేసుకున్న కొన్నేళ్లలోనే అద్భుతమైన పని తీరుతో పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం అందుకున్నారు. డిప్యుటేషన్‌పై ఏపీకి రానున్న కృష్ణతేజ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యవేక్షించే శాఖల్లో పనిచేస్తారని సమాచారం. ఇటీవల ఆయన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్‌లను కలిసిన సంగతి తెలిసిందే. ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజకు పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. కాగా నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఇప్పటికే భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.