Andhra Pradesh: తాకట్టు బంగారాన్ని చెక్ చేసిన బ్యాంక్ మేనేజర్.. ఒక్కసారిగా లెక్కలు చూడగా మైండ్ బ్లాంక్!

తాకట్టు కోసం తీసుకెళ్లిన బంగారాన్ని.. బ్యాంక్ సిబ్బంది చెక్ చేయడమే కాకుండా అది ఎంత బరువుంది.? స్వచ్చమైన బంగారమా.? లేక నకిలీదా.? అనే అంశాలను పరిశీలిస్తారు.

Andhra Pradesh: తాకట్టు బంగారాన్ని చెక్ చేసిన బ్యాంక్ మేనేజర్.. ఒక్కసారిగా లెక్కలు చూడగా మైండ్ బ్లాంక్!
Gold Appraiser
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 24, 2022 | 12:06 PM

బ్యాంకుల్లో బంగారంపై రుణం తీసుకునేందుకు చాలా ప్రొసిజర్ ఉంటుంది. మనం తాకట్టు కోసం తీసుకెళ్లిన బంగారాన్ని.. బ్యాంక్ సిబ్బంది చెక్ చేయడమే కాకుండా అది ఎంత బరువుంది.? స్వచ్చమైన బంగారమా.? లేక నకిలీదా.? అనే అంశాలను పరిశీలిస్తారు. ఇక ఇదంతా కూడా అక్కడ పని చేసే గోల్డ్ అప్రైజర్ చేస్తాడు. ప్రతీ బ్యాంక్‌లోని ఇలాంటి అప్రైజర్ ఒకడు తన బాధ్యతలను నిర్వర్తిస్తుంటాడు. ఇంతటి కీలక విధుల్లో ఉన్న ఓ బ్యాంక్ అప్రైజర్.. ఘరానా మోసానికి పాల్పడ్డాడు. తన కొడుకుతో కలిసి భారీ స్కెచ్ వేసి ఏకంగా రూ. 35 లక్షలు మాయం చేశాడు.

వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా చేబ్రోలులోని తమిళనాడు మర్కెంటైల్ బ్యాంకులో బాబురావు అనే వ్యక్తి గోల్డ్ అప్రైజర్‌గా ఐదేళ్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్నాడు. డబ్బు అవసరమా లేక మరేదైనా కారణమో తెలియదు గానీ.. అతడు తన కుమారుడు, ముగ్గురు స్నేహితులతో కలిసి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. బ్యాంక్ మేనేజర్ లీవ్‌లో ఉన్న సమయం చూసుకుని నకిలీ బంగారాన్ని తీసుకొచ్చి తాకట్టు పెట్టాడు. తద్వారా సుమారు రూ. 35 లక్షలు రుణాన్ని తీసుకున్నాడు. తన ప్లాన్ ప్రకారం చేయాల్సిందంతా చేసేసి సైలెంట్ అయిపోయాడు. ఇదంతా కూడా ఎవ్వరికీ తెలియదని అనుకున్నాడు.

ఇవి కూడా చదవండి

కానీ బ్యాంక్ మేనేజర్ లీవ్ నుంచి వచ్చిన తర్వాత సుబ్బారావు ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించాడు. అనుమానమొచ్చి తాకట్టు పెట్టిన బంగారాన్ని, అందుకు సంబంధించిన లెక్కలను పరిశీలించాడు. అంతే! అసలు గుట్టు అంతా బయటపడింది. బంగారం నకిలీదని తేలింది. ఆ ఫేక్ బంగారంతో రూ. 35 లక్షలు స్వాహా అయినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..