Amaravati Farmers Padayatra: అమరావతి రైతుల పాదయాత్రకు ఇవాళ బ్రేక్.. మళ్లీ ఎప్పుడు మొదలంటే..
Amaravati Farmers Padayatra: అమరావతి టు అరసవల్లి పాదయాత్రకు స్మాల్ బ్రేక్ ఇచ్చారు రైతులు. మళ్లీ తిరిగి రేపు కొత్తూరు నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు.
Amaravati Farmers Padayatra: అమరావతి టు అరసవల్లి పాదయాత్రకు స్మాల్ బ్రేక్ ఇచ్చారు రైతులు. మళ్లీ తిరిగి రేపు కొత్తూరు నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. 16వ రోజు ఏలూరు, పాలగుడె మీదుగా కొవ్వలి వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. అమరావతి రైతుల మహా పాదయాత్ర, పదిహేనో రోజు ఏలూరు జిల్లాలో కొనసాగింది. పెదపాడు మండలం కొనికి గ్రామం నుంచి మొదలైన పాదయాత్ర, పెదపాడు మీదుగా కొత్తూరు వరకు సాగింది. అమరావతి రైతులకు సంఘీభావంగా విపక్షాలు, ప్రజాసంఘాలు, ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, టీడీపీ లీడర్స్ మాగంటి బాబు, జవహర్, చింతమనేని ప్రభాకర్… అమరావతి రైతులతో కలిసి అడుగులో అడుగేశారు.
ప్రతిపక్షంలో ఉండగా రాజధానిని మార్చబోమని చెప్పిన వైసీపీ, ఇప్పుడెందుకు మాట మార్చిందని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. అమరావతి రైతుల పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఆనాడు తాము తలుచుకుంటే జగన్ పాదయాత్ర చేయగలిగేవారా? అంటూ ప్రశ్నించారు నిమ్మల. కాగా, పాదయాత్రకు నేడు బ్రేక్ ఇచ్చిన రైతులు.. రేపు కొత్తూరు నుంచి ప్రారంభించనున్నారు. 16వ రోజు ఏలూరు, పాలగుడె మీదుగా కొవ్వలి వరకు పాదయాత్ర కొనసాగుతుందని అమరావతి రైతు నేతలు ప్రకటించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..