Telangana: కనుచూపుమేర కృష్ణా నీరు.. ఎటూ వెళ్లలేక మూడు నెలలుగా అక్కడే జీవనం.. మూగ జీవి అవస్థలు..
Telangana: గత మూడు నెలలుగా ఒంటరిగా ఒకే దగ్గర జీవనం.. కనుచూపుమేర కృష్ణానది నీరు.. ఎటువెళ్లలేని ధీన పరిస్థితి.. ఆహారం కోసం ఎదురుచూపులు..
Telangana: గత మూడు నెలలుగా ఒంటరిగా ఒకే దగ్గర జీవనం.. కనుచూపుమేర కృష్ణానది నీరు.. ఎటువెళ్లలేని ధీన పరిస్థితి.. ఆహారం కోసం ఎదురుచూపులు.. ఇలా నీటి మధ్యలో ఉన్న ఐలాం డ్‌లో చిక్కుకుని ఎంతో ఇబ్బంది పడుతూ బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతుంది ఒక కోతి. వివరాల్లోకెళితే.. నాగర్ కర్నూ ల్ జిల్లా పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట గ్రామం, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూ ల్ జిల్లా పగిడ్యాల మండలం నెహ్రునగర్ రెండు రాష్ట్రాలను విడదీస్తూ ప్రవహించే కృష్ణానదిలో ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్‌లో గత జులై నెల నుంచి ఒక కోతి చిక్కుకుపోయింది. ఎలా అక్కడి చేరిందో తెలియదు గానీ, చుట్టూ భారీగా నీరు ఉండటంతో ఐలాండ్ నుంచి కోతి బయటకు వచ్చే అవకాశమే లేకుండా పోయింది. తరచూ కురుస్తున్న భారీవర్షాల కారణంగా కృష్ణా నదికి భారీ వరద వస్తోంది. దాంతో ఈ ప్రాంతంలో శ్రీశైలం బ్యాక్ వాటర్ భారీగా నిలిచి ఉంటాయి. ఇక్కడ నీరు తగ్గాలంటే మరో ఆరునెలలు సమయం పట్టే అవకాశం ఉంది. అయితే, ఆ ఐలాండ్‌లో చిక్కుకున్న వానరం.. ఆకలితో అలమటించిపోయింది. ఈ క్రమంలోనే ఓ రోజు వానరం నదిలో ప్రయాణికులను చేరవేస్తున్న బోటు నిర్వాహకుల దృ ష్టిలో పడింది. దాంతో వారు ఆ కోతికి పండ్లు, ఆహారం అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. అధికారులు స్పందించి ఈ కోతిని ఐలాండ్ నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నా రు.
అయితే, అక్కడివారు ఆ కోతిని కాపాడటానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. కోతి వారిని చూసి భయంతో పరులుగు తీస్తోంది. దాంతో వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే, ఆకలితో అలమటించకుండా.. ఆ కోతికి అవసరమైన ఆహారాలను అందిస్తున్నారు అక్కడి ప్రజలు. ఫారెస్ట్ సిబ్బంది వచ్చి కోతిని అక్కడి నుంచి తీసుకురావాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..