AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ జిల్లా వాసులకు నిజంగా ఇది శుభవార్తే.. ప్రభుత్వ ఆస్పత్రిలో మోకాలు మార్పిడి చికిత్స..

Telangana: కేవలం కార్పొరేట్ ఆసుపత్రులలో మాత్రమే నిర్వహించే మోకాలు మార్పిడి శస్త్ర చికిత్సలు ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని..

Telangana: ఆ జిల్లా వాసులకు నిజంగా ఇది శుభవార్తే.. ప్రభుత్వ ఆస్పత్రిలో మోకాలు మార్పిడి చికిత్స..
Minister Srinivas Goud
Shiva Prajapati
|

Updated on: Sep 26, 2022 | 9:41 AM

Share

Telangana: కేవలం కార్పొరేట్ ఆసుపత్రులలో మాత్రమే నిర్వహించే మోకాలు మార్పిడి శస్త్ర చికిత్సలు ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ ప్రభుత్వ ప్రధాన ఆసూపత్రిలో మోకాలు మార్పిడి శస్త్ర చికిత్సలకు సంబంధించిన యూనిట్ ను ప్రారంభించారాయన. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటివరకు మహబూబ్ నగర్ జిల్లాలో మోకాలు మార్పిడి శస్త్ర చికిత్సకు సంబంధించిన ఇంప్లాంట్స్ లేక పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారని, ఈరోజు నుండి ఈ సేవలు అందుబాటులోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చాలామంది భయంతో మోకాలు మార్పిడి శస్త్ర చికిత్సలను చేయించుకునేందుకు ముందుకు వచ్చేవారు కాదని, ఇప్పుడు మహబూబ్ నగర్లోనే ఇలాంటి సేవలు అందుబాటులోకి రావడం వల్ల అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. ఇందుకు ఆయన డాక్టర్లను అభినందించడమే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతకు ముందు మంత్రి.. ఆర్థో వార్డులో మోకాలు మార్పిడి శస్త్ర చికిత్స మార్పిడి వైద్యం కోసం వచ్చిన చిన్నారెడ్డి, సరోజ, లక్ష్మీ దేవిలతో మాట్లాడుతూ ఎలాంటి భయం లేదని, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ పరికరాలు వాడుతున్నామని వారికి వివరించారు.

ఇకపోతే, ఇటివలి కాలం వరకు మోకాలి మార్పిడి చికిత్స కేవలం గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఆ తరువాత రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మోకాలు చిప్ప ఆపరేషన్లు నిర్వహించారు. ఇప్పుడు మహబూబ్‌నగర్‌లోనూ మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్స అందుబాటులోకి వచ్చింది. ఈ సదుపాయం వల్ల జిల్లా ప్రజలు మోకాలి సంబంధిత సమస్యలకు చికిత్స కోసం ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం ఉండదు. కాగా, మోకాలి చిప్ప మార్పిడి చికిత్స జిల్లా ఆస్పత్రిలో అందుబాటులోకి రావడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..