AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యూ మలక్‌పేట్ రోడ్డులో భారీ గుంత.. ముందే చూశారు కాబట్టి సరిపోయింది.. లేకపోతేనా!

న్యూ మలక్‌పేట్ రోడ్డు, లాల్జార్ హోటల్ వద్ద మట్టి పూడ్చిన రోడ్డు కుంగి భారీ గుంత ఏర్పడింది. ట్రాక్టర్ వెళ్తున్నప్పుడు ప్యాచ్ కూలి వాక్యూమ్ లాంటి గుంత, నీటి పైపు లీకేజీ కనిపించాయి. పోలీసులు వెంటనే బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. AIMIM ఎమ్మెల్యే అహ్మద్ బలాలా తక్షణ చర్యలు, మరమ్మతులకు ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖలు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

న్యూ మలక్‌పేట్ రోడ్డులో భారీ గుంత.. ముందే చూశారు కాబట్టి సరిపోయింది.. లేకపోతేనా!
Malakpet Road Collapse
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Feb 11, 2026 | 9:23 PM

Share

హైదరాబాద్‌ న్యూ మలక్‌పేట్ రోడ్డులో భారీ గుంత ఏర్పడింది. ఆ మార్గంలోని లాల్జార్ హోటల్ సమీపంలో రోడ్డుపై ట్రాక్టర్ వెళుతుండగా ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. లాల్జార్ హోటల్ సమీపంలో ఇటీవల మట్టితో పూడ్చిన రోడ్ ప్యాచ్ అకస్మాత్తుగా కూలిపోవడంతో భారీ గుంత ఏర్పడింది. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్ కారణంగా ప్యాచ్ వర్క్ కుంగిపోవడంతో వాక్యూమ్‌లా లోతైన గుంత ఏర్పడింది. గుంతలో నీటి పైప్ లైన్ లీకేజ్ కూడా కనిపించింది.

సమాచారం అందుకున్న వెంటనే దబీర్‌పురా పోలీసులు, మలక్‌పేట్ ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గుంత చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాహనదారులను దారి మళ్లీంచారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.

ఈ విషయంపై మలక్‌పేట్ AIMIM ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా పార్టీ కార్యకర్తలకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖలు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..