Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బాబోయ్ ఇదెక్కడి పెయింటింగ్ రా అయ్యా.. తట్టుకోగలరు అనుకుంటేనే దీనిని చూడండి..

Viral Video: ప్రపంచంలో కళాకారులకు కొరత లేదు. జిహ్వకో రుచి అన్నట్లుగా.. ఒక్కొక్కరిది ఒక్కోరకమైన కళలో ఆరితేరి ఉంటారు.

Viral Video: బాబోయ్ ఇదెక్కడి పెయింటింగ్ రా అయ్యా.. తట్టుకోగలరు అనుకుంటేనే దీనిని చూడండి..
3d Face Painting
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 26, 2022 | 11:01 AM

Viral Video: ప్రపంచంలో కళాకారులకు కొరత లేదు. జిహ్వకో రుచి అన్నట్లుగా.. ఒక్కొక్కరిది ఒక్కోరకమైన కళలో ఆరితేరి ఉంటారు. అలాంటి వారి కళలలు యావత్ ప్రపంచాన్నే అబ్బురపరుస్తాయి. ఎక్కువశాతం పెయింటింగ్స్ పట్ల ప్రజలు మక్కువ చూపుతారు. పెయింటర్స్ కూడా తమలోని సృజనాత్మకతను మొత్తం వెలికితీసి మరీ పెయింటింగ్స్ వేస్తుంటారు. కొందరు పెపర్ పెయింట్స్ వేస్తే.. ఇంకొందరు వస్తువులపై వేస్తారు.. మరికొందరయితే వ్యక్తులపై అద్భుతంగా పెయింటింగ్స్ వేస్తారు. తాజాగా అలాంటి పెయింటింగ్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆ పెయింటింగ్ చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. వామ్మో ఇదేం పెయింటింగ్ అంటూ హడలిపోతున్నారు. అదే సమయంలో పెయింటర్ సృజనాత్మకతకు సలామ్ కొడుతున్నారు.

చాలామంది ఫేస్ పెయింటింగ్స్ వేస్తుంటారు. కానీ, ఈ పెయింటర్ మాత్రం నెక్ట్స్‌లెవల్‌లో వేశారు. అమ్మాయిల ముఖాలకు 3డీ పెయింటింగ్ వేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో 7 రకాల ‘ఫేస్ పెయింటింగ్స్’ ఉన్నాయి. వీటిని చూసి నెటిజన్లు అయోమయానికి గురవుతున్నారు. అందులోని కొన్ని పెయింటింగ్స్ అయితే, భయపెట్టేలా ఉన్నాయి. పెయింటింగ్‌లో ఒక అమ్మాయి ముఖాన్ని రెండు ముఖాలుగా, నాలుగు కళ్లు ఉన్నట్లు ప్రతిబింబించేలా చిత్రీకరించారు. మరో పెయింటింగ్‌లో అమ్మాయి ముఖాన్ని బార్బీ బొమ్మలా చక్కగా వేశఆడు. ఇందులో నిజమైన ఫేస్ ఏంటో, పెయింటింగ్ ఏదో గుర్తించలేనంతగా ఉంటుంది. ఇక మూడో పెయింటింగ్‌లో అమ్మాయి ముఖం జోంబిలా కనిపిస్తుంది. ఇలా మిగతా పెయింటింగ్స్ కూడా చాలా ఆశ్చర్యకరంగా, షాకింగ్‌గా ఉన్నాయి. వీటిని చూసి జనాలు ఫుల్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అదే సమయంలో భయాందోళనకు కూడా గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ షాకింగ్ వీడియోను @Artgalleryin పేరుతో ఉన్న ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ‘ఇన్‌క్రెడిబుల్ ఫేస్ పెయింటింగ్’ అనే క్యాప్షన్ కూడా పెట్టారు. 45 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటి వరకు 59 వేలకు పైగా వ్యూస్ రాగా, 3 వేల మందికి పైగా లైక్ చేశారు. దీనికి నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్స్ కూడా వస్తున్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయని, పెయింటర్ సృజనాత్మకతను ప్రశంసిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..