Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: ‘సూర్య’ ఓ అద్భుతం.. ఎలాంటి పరిస్థితులను అయినా అనుకూలంగా మార్చేస్తాడు.. కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఆస్ట్రేలియాతో భారత్ T20 సిరీస్ గెలవడంతో హీరోలుగా మారారు విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్. ఆసియా కప్ ముందు వరకు ఫామ్ లో లేక అభిమానుల విమర్శలు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ ఇప్పుడు అదే అభిమానుల ప్రశంసలు..

Cricket: 'సూర్య' ఓ అద్భుతం.. ఎలాంటి పరిస్థితులను అయినా అనుకూలంగా మార్చేస్తాడు.. కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Virat Kohli, Surya Kumar Yadav
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 26, 2022 | 12:48 PM

Cricket: ఆస్ట్రేలియాతో భారత్ T20 సిరీస్ గెలవడంతో హీరోలుగా మారారు విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్. ఆసియా కప్ ముందు వరకు ఫామ్ లో లేక అభిమానుల విమర్శలు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ ఇప్పుడు అదే అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆస్ట్రేలియాతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో 1-1తో సమంగా ఉన్న రెండు జట్లుకు హైదరాబాద్ లో జరిగిన మూడో మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఈ మూడో మ్యాచుల్లో భారత్ గెలుసులో కీలకంగా వ్యవహరించింది మాత్రం సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ అనే చెప్పుకోవాలి. పవర్ ప్లే లో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్ ను కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ తమ అద్భుతమైన బ్యాటింగ్ తో జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ పై భారత క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిస్తుండగా.. సూర్య కుమార్ యాదవ్ పై విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సూర్య బ్యాటింగ్ పై విరాట్ ప్రశంసలు కురిపించాడు. ఎలాంటి పరిస్థితులను అయినా తనకు అనుకూలంగా మార్చేయగలడని సూర్యను పొగడ్తలతో ముంచెత్తాడు భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 69 పరుగులు చేసి 191.7 స్ట్రైక్ రేటుతో నిలవగా, విరాట్ కోహ్లి 48 బంతుల్లో 63 పరుగులు చేసి భారత్ కు విజయాన్ని అందించారు. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. సూర్యకుమార్‌ యాదవ్ ను ప్రశంసిస్తూ, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేమ ఆట తన వద్ద ఉందంటూ చెప్పుకొచ్చాడు కోహ్లీ. గత కొద్ది నెలలుగా సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడని తెలిపాడు. గ్రౌండ్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతను ఏమి చేయాలనుకుంటాడో, ఎలా బ్యాటింగ్ ఆడాలనుకుంటాడో ఫుల్ క్లారిటీతో ఉంటాడని, ఎలాంటి స్విచ్ వేషన్ లో అయినా బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉందంటూ కోహ్లీ కొనియాడాడు. సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన ఆటతీరును చూశానని, ఇంగ్లాండ్ పై సెంచరీ సాధించాడని, ఆసియా కప్ లోనూ బ్యూటిఫుల్ బ్యాటింగ్ చేశాడంటూ కితాబిచ్చాడు. భయం లేకుండా ఏ టైంలో ఏ షాట్ ఆడాలో పూర్తి క్లారిటీతో ఆడతాడని విరాట్ కోహ్లీ.. సూర్య కుమార్ యాదవ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..