Cricket: ఆ పదవి కోసం అమిత్ షా కుమారుడు జై షా కు లైన్ క్లియర్.. ‘ఎన్నికే’ తరువాయి..?

భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు-BCCI తదుపరి అధ్యక్షుడి ఎన్నిక కోసం ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 4వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉండగా.. అక్టోబర్18వ తేదీన పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్ల లెక్కింపు..

Cricket: ఆ పదవి కోసం అమిత్ షా కుమారుడు జై షా కు లైన్ క్లియర్.. 'ఎన్నికే' తరువాయి..?
Sourav Ganguly, Jay Shah
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 26, 2022 | 9:54 AM

Cricket: భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు-BCCI తదుపరి అధ్యక్షుడి ఎన్నిక కోసం ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 4వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉండగా.. అక్టోబర్18వ తేదీన పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్ల లెక్కింపు చేపడతారు. అయితే తదుపరి బీసీసీఐ అధ్యక్షులు ఎవరనే దానిపై ఇప్పటికే ఓ క్లారిటీ ఉన్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న అమిత్ షా కుమారుడు జై షా తదుపరి బీసీసీఐ అధ్యక్షులు అయ్యే అవకాశం మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 22 రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ లు జైషా కు మద్దతు ప్రకటించాయి. దీంతో బీసీసీఐ ఛైర్మన్ పగ్గాలు జై షా చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షులు సౌరవ్ గంగూలీని అంతర్జాతీయ క్రికెట్ మండలి- ICCకి పంపుతారనే ప్రచారం జోరందుకుంది. ICC ఛైర్మన్‌ పదవి వైపు సౌరవ్ గంగూలీని పంపించి బీసీసీఐ అధ్యక్షుడిగా జై షా ఎంపికకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రాజీనామా చేశారని, జై షా తదుపరి అధ్యక్షుడంటూ వదంతులు సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొట్టాయి. అయితే అధికారికంగా బీసీసీఐ దానిని ఖండించింది. ఆ ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే మాత్రం BCCI పాలకవర్గంలో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరో రెండు నెలల్లో అంటే దాదాపు నవంబరులో సౌరవ్ గంగూలీ ఐసీసీ ఛైర్మన్‌ బాధ్యతలు చేపట్టేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుత ICC ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్క్‌లీ పదవీ కాలం పూర్తవుతున్న నేపథ్యంలో అత్యున్నత పీఠానికి ఎన్నికలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో సౌరవ్ గంగూలీ అభ్యర్థిత్వానికి BCCI మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. బీసీసీఐకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆ స్థానాన్ని ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి జైషా తో భర్తీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుత బోర్డు కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ కార్యదర్శిగా ఎన్నికయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతం 22 రాష్ట్ర సంఘాలు జై షాకు మద్దతు ఇస్తున్నాయి. బోర్డు రాజ్యాంగంలో సవరణలకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపడంతో బీసీసీఐకి అక్టోబర్ 18వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి.కోవిడ్‌ మహమ్మారి సమయంలో జై షా వల్లే ఐపీఎల్‌ జరిగినట్లు అత్యధిక సంఘాలు భావిస్తున్నాయి. దీంతో బీసీసీఐ అధ్యక్షుడిగా జై షా అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే