Hema Malini: ‘రాఖీ సావంత్’ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తుంది..? ఎంపీ హేమమాలిని ఆసక్తికర వ్యాఖ్యలు..
సినీ నటులు, రాజకీయ ప్రముఖులు లేదా ఇతర ప్రముఖులు ఎవరైనా ఒకోసారి మాట్లాడే మాటలు అనుకోకుండా వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో తమకు ఎదురయ్యే ప్రశ్నలను ఎదుర్కొనేందుకు వారిచ్చే సమాధానం కూడా వైరల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ స్టేట్ మెంట్ సోషల్ మీడియాలో..

Uttar Pradesh: సినీ నటులు, రాజకీయ ప్రముఖులు లేదా ఇతర ప్రముఖులు ఎవరైనా ఒకోసారి మాట్లాడే మాటలు అనుకోకుండా వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో తమకు ఎదురయ్యే ప్రశ్నలను ఎదుర్కొనేందుకు వారిచ్చే సమాధానం కూడా వైరల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ స్టేట్ మెంట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సిని నటిగా ఉంటూనే గత కొంతకాలంగా కేంద్రంలోని బీజేపీ(BJP)కి మద్దతుగా మాట్లాడుతూ వస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆమె ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అలాగే బీజేపీ నుంచి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఆమె పోటీ చేసే స్థానంపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతూ వస్తోంది. ప్రస్తుతం నటి హేమమాలిని బీజేపీ నుంచి ఉత్తరప్రదేశ్ లోని మథుర నుంచి ఎంపీగా ఉన్నారు. ఆమె వయసు రీత్యా వచ్చే ఎన్నికల్లో పోటీచేయకపోవచ్చనే ప్రచారం సాగుతోంది. అలాగే తనకు ఇవే చివరి ఎన్నికలని హేమమాలినే స్వయంగా 2019లో ప్రకటించారు. ఈక్రమంలో హేమమాలిని స్థానాన్ని బీజేపీ నుంచి కంగనా రనౌత్ భర్తీ చేస్తారనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. దీంతో మీడియా ప్రతినిధులు ఇదే విషయాన్ని హేమమాలిని అడిగేశారు.
కంగనా రనౌత్ మథుర నుంచి పోటీచేస్తారనే ప్రచారం జరుగుతోందంటూ అడగ్గా.. హేమమాలినొ( Hema Malini) తనదైన స్టైల్ లో స్పందించారు. ఈసందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు సైతం చేశారు. మొదట మాత్రం దీనిపై నేనేం చెప్పగలను.. అంతా భగవంతుడి(GOD) దయ.. కృష్ణుడు ఏం చేయాలనుకుంటే అదే చేస్తాడంటూ ఆచీతూచీ సమాధానం ఇచ్చారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కాని కాసేపటికే మళ్లీ మాట్లాడుతూ.. మథుర నుంచి స్థానికులెవరికి అవకాశం ఇవ్వరన్న మాట.. సినీ నటులే ఇక్కడ పోటీచేయాలని మీరు బలంగా నిర్ణయించుకున్నారంటూ మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా.. సినిమా స్టార్ లను మాత్రమే మథుర కోరుకుంటే రాఖీ సావంత్ కూడా రేపు ఎన్నికల్లో పోటీ చేస్తోందంటూ సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఈవ్యాఖ్యలు హట్ టాపిక్ గా మారాయి. కంగనా రనౌట్ పోటీ చేయడం ఇష్టం లేక హేమమాలిని ఇలా ఇండైరెక్ట్ గా సమాధానం చెప్పారా.. లేకపోతే అసందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించినందుకు వ్యంగంగా ఈ వ్యాఖ్యలు చేశారా అనేది తెలియరాలేదు.




2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో హేమమాలిని ఉత్తరప్రదేశ్ లోని మథుర పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుస్తూ వచ్చారు. ఇప్పటికే ఆమె వయసు ఏడు పదులు దాటడంతో వచ్చే ఎన్నికల్లో ఆమెకు ఛాన్స్ రాకపోవచ్చనే చర్చ జోరందుకుంది. మరోవైపు తాను వచ్చే ఎన్నికల్లో పోటీచేయబోనని, తనకు ఇవే చివరి ఎన్నికలంటూ 2019లో హేమమాలిని ప్రకటించారు. దీంతో ఈస్థానాన్ని మరో నటి కంగనా రనౌత్ భర్తీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో హేమమాలిని వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
#WATCH | Mathura, Uttar Pradesh: When asked about speculation that actor Kangana Ranaut could contest elections from Mathura, BJP MP Hema Malini says, “Good, it is good…You want only film stars in Mathura. Tomorrow, even Rakhi Sawant will become.” pic.twitter.com/wgQsDzbn5Z
— ANI (@ANI) September 24, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..