IMS Chennai Recruitment 2022: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌లో అడ్మినిస్ట్రేటివ్‌, లైబ్రరీ ట్రైనీ పోస్టులు..ఈ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ (IMS Chennai).. ఒప్పంద ప్రాతిపదికన 12 అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైనీ, లైబ్రరీ ట్రైనీ, రీసెర్చ్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, జేఆర్‌ఎఫ్ పోస్టుల (Administrative Trainee Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

IMS Chennai Recruitment 2022: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌లో అడ్మినిస్ట్రేటివ్‌, లైబ్రరీ ట్రైనీ పోస్టులు..ఈ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు..
Ims Chennai
Follow us

|

Updated on: Sep 25, 2022 | 9:17 AM

IMS Chennai Administrative Trainee Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ (IMS Chennai).. ఒప్పంద ప్రాతిపదికన 12 అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైనీ, లైబ్రరీ ట్రైనీ, రీసెర్చ్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, జేఆర్‌ఎఫ్ పోస్టుల (Administrative Trainee Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఏదైనా డిగ్రీ, ఎమ్‌ఎల్ఐఎస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2020, 2021, 2022 సంవత్సరాల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే ఇంగ్లిష్‌ ల్యాంగ్వేజ్‌లో నైపుణ్యం ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఈ మెయిల్‌ ద్వారా అక్టోబర్‌ 5, 2022వ తేదీలోపు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, రాత పరీక్ష, టైపింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.15,000ల చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైనీ ఖాళీలు: 3
  • లైబ్రరీ ట్రైనీ ఖాళీలు: 2
  • రీసెర్చ్‌ అసోసియేట్‌ ఖాళీలు: 4
  • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ ఖాళీలు: 2
  • జేఆర్‌ఎఫ్ ఖాళీలు: 1

ఈ మెయిల్ ఐడీ:

ఇవి కూడా చదవండి
  • admntrainee@imsc.res.in
  • librarytrainee@imsc.res.in

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.