PM MODI: ఆ విమానాశ్రయానికి మారనున్న పేరు.. కొత్త పేరు ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీ..
స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ పేరును చంఢీగఢ్ విమానాశ్రయానికి పెడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ నెల మన్ కీ బాత్ ప్రసంగంలో స్వయంగా వెల్లడించారు. భగత్‌సింగ్ జయంతి వేళ ఆయనకు నివాళిగా ఈ నిర్ణయం..
PM MODI: ఆంధ్రప్రదేశ్ లో వైద్య విశ్వవిద్యాలయానికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పేర్పు మార్పు వివాదం చల్లారకముందే, ఇప్పుడు చంఢీగడ్ విమానశ్రయానికి కొత్త పేరును కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈవిషయంలో ఏ పార్టీకి ఎటువంటి వివాదం లేదు. అసలు విషయానికొస్తే ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ పేరును చంఢీగఢ్ విమానాశ్రయానికి పెడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ నెల మన్ కీ బాత్ ప్రసంగంలో స్వయంగా వెల్లడించారు. భగత్‌సింగ్ జయంతి వేళ ఆయనకు నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నరేంద్రమోదీ తెలిపారు. అలాగే సెప్టెంబర్ నెల మన్ కీ బాత్ లో ప్రధాని అనేక విషయాలను ప్రస్తావించారు. వాతావరణ మార్పులు, ఇటీవల భారత్‌కు తీసుకువచ్చిన చీతాలు వంటి విషయాలను ప్రముఖంగా ప్రస్తావించారు. సెప్టెంబర్ 28న భగత్‌సింగ్ జయంతి జరుపుకోనున్న వేళ సమరయోధుడికి నివాళిగా చంఢీగఢ్ ఎయిర్‌పోర్టుకు ఆయన పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. వాతావరణ మార్పు జీవావరణ వ్యవస్థకు అతిపెద్ద ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
సముద్ర తీర ప్రాంతాలకు వాతావరణ మార్పులు పెను సవాలుగా మారాయన్నారు నరేంద్ర మోదీ. బీచ్‌లలో చెత్త పేరుకుపోవడం కలవరపెట్టే విషయమన్నారు. ఇలాంటి తీవ్ర సవాళ్లను మనందరి బాధ్యతగా కలిసికట్టుగా ఎదుర్కోవాలని సూచించారు. సుదీర్ఘ కాలం తర్వాత దేశంలోకి చీతాలు రావడంపై దేశవ్యాప్తంగా ఎంతోమంది సంతోషం వ్యక్తం చేశారన్న ప్రధానమంత్రి.. చీతాలను ఎప్పటినుంచి చూడవచ్చనే దానిపై వాటిని పర్యవేక్షిస్తోన్న టాస్క్‌ఫోర్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీజేపీ సిద్ధాంతకర్త దీన్ దయాల్ ఉపాధ్యాయ్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. దేశ మహోన్నతమైన కుమారుడిగా ఆయనను పేర్కొన్నారు. రాబోయే పండుగల సందర్భంగా ప్రజలు స్థానికంగా తయారుచేసిన నాన్ ప్లాస్టిక్ సంచులను వాడాలని సూచించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో సెప్టెంబర్ 28వ తేదీకి ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పారు. భగత్ సింగ్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 28ని ప్రత్యేక దినోత్సవంగా నిర్వహించుకోవాలని సూచించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..