Madhya Pradesh: స్నేహితురాలు వాష్ రూమ్ లో ఉండగా వీడియో తీసి.. డబ్బులు డిమాండ్.. సీన్ కట్ చేస్తే..
విశ్వకర్మ జయంతి సందర్భంగా విద్యాసంస్థలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని, బాత్రూంలోకి వెళ్లి దుస్తులు మార్చుకొంటున్న ఒక విద్యార్థినిని ఆమె సహాధ్యాయులు ముగ్గురు వీడియో తీశారు. తర్వాత ఆ వీడియో చూపించి ఆమె నుంచి..
Madhya Pradesh: స్నేహమంటే ఓ నమ్మకం, స్నేహం కోసం ఏది చేయడానికైనా రెడీ అయిపోతారు. అదే స్నేహితులు మోసం చేస్తే అసలు తట్టుకోలేరు. తమ వెంట ఉంటూ.. నమ్మించి మోసం చేశారంటూ ఏళ్ల తరబడి కుమిలిపోతారు. అలాంటప్పుడు మరెవరితో అయినా స్నేహం చేయాలంటేనే భయపడిపోతారు. మరి కొంతమంది తమ స్నేహితులను మోసం చేయాలంటే భయపడతారు. తమ కష్ట, సుఖాలను స్నేహితులతోనే చెప్పుకుంటారు. ఎందుకంటే మన సమాజంలో స్నేహనికి ఎంతో విలువుంది. మనం కష్టాల్లో ఉంటే ఓదార్చేది స్నేహితులే. కాని స్నేహితులను మోసం చేయాలనే ఆలోచనే రాదు కొంతమందికి. కాని మరికొంతమంది తమ అవసరాల కోసం స్నేహితులనే కాదు ఎవరినైనా మోసం చేస్తారు. అది తప్పని తెలిసినా సరే వారి పద్దతి మార్చుకోరు. ఇలా తమతో చదువుకునే ఓ స్నేహితురాలిని సహాధ్యాయులు ముగ్గరు కలిసి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడిన ఘటన మధ్య ప్రదేశ్ లో జరిగింది. విశ్వకర్మ జయంతి సందర్భంగా విద్యాసంస్థలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని, బాత్రూంలోకి వెళ్లి దుస్తులు మార్చుకొంటున్న ఒక విద్యార్థినిని ఆమె సహాధ్యాయులు ముగ్గురు వీడియో తీశారు. తర్వాత ఆ వీడియో చూపించి ఆమె నుంచి రూ.7,000 డిమాండ్ చేశారు. విషయం పోలీసులకు తెలియడంతో వీడియో తీసిన యువకుల్లో ఒకరిని అరెస్టు చేసి, మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. వీడియో తీసి విద్యార్థినిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుదామనుకున్న యువకుల ప్లాన్ బెడిసికొట్టడంతో వారు కటకటాల పాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భోపాల్‌లోని గోవింద్‌పురా ప్రాంతంలో ఉన్న ఒక ITI కళాశాలలో ఈఏడాది సెప్టెంబరు 17వ తేదీన ఈవీడియోను యువకులు తీశారు. విషయం తెలిసి తీవ్ర మనస్థాపం చెందిన విద్యార్థిని ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే తమ కుమార్తె కనబడటం లేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ అమ్మాయిని భోపాల్ రైల్వే స్టేషన్ లో గుర్తించారు. ఆ అమ్మాయిని విచారించగా తెర వెనకు కథంతా బయటకు వచ్చింది. దీంతో యువకుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..