Savings: మీ సంపాదన నీళ్లలా ఖర్చు అయిపోతుందా.. ఈ చిట్కాలతో కొంత పొదుపు చేసుకోవచ్చు..

చాలా మంది నెలకు ఎంత సంపాదించినా.. పది రోజుల్లోనే ఖాతా ఖాళీ అయిపోతుంది. మళ్లీ ఒకటో తేదీ ఎప్పుడు వస్తుందా.. అని ఎదురు చూస్తూ ఉంటాం. ఇది సాధారణంగా పేద, మధ్య తరగతి కుటుంబాల్లో కనిపిస్తుంది. అదే ధనిక కుటుంబానికి చెందిన వారికి సాధారణంగా ఇటువంటి సమస్య..

Savings: మీ సంపాదన నీళ్లలా ఖర్చు అయిపోతుందా.. ఈ చిట్కాలతో కొంత పొదుపు చేసుకోవచ్చు..
Salary Protection Plan
Follow us

|

Updated on: Sep 25, 2022 | 1:56 PM

Savings: చాలా మంది నెలకు ఎంత సంపాదించినా.. పది రోజుల్లోనే ఖాతా ఖాళీ అయిపోతుంది. మళ్లీ ఒకటో తేదీ ఎప్పుడు వస్తుందా.. అని ఎదురు చూస్తూ ఉంటాం. ఇది సాధారణంగా పేద, మధ్య తరగతి కుటుంబాల్లో కనిపిస్తుంది. అదే ధనిక కుటుంబానికి చెందిన వారికి సాధారణంగా ఇటువంటి సమస్య ఉత్పన్నం కాదు. పేద, మధ్య తరగతి ప్రజల్లో కూడా ఓ ప్లాన్ ప్రకారం ఖర్చు చేసుకుంటే పెద్దగా ఇబ్బందులు రావు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారిని పరిశీలిస్తే వారికి అందరిలాగే ఎన్నో కోర్కెలు ఉంటాయి. వాటిని తీర్చుకోవడానికి వచ్చే ఆదాయం తక్కువుగా ఉంటుంది. దీంతో కోర్కెలను వాయిదా వేసుకుంటూ వెళ్లిపోతారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. దీంతో వేతన జీవులు బతుకుబండి ఈడ్చడం కష్టంగానే మారింది. అయితే మనకు వచ్చే సంపాదనను బట్టి మన ఖర్చులు ఉండేలా చూసుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. అయినా సరే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. కాని ఫర్ ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే మనకు వచ్చే జీతంలోనే కొంత పొదుపు కూడా చేసుకోవచ్చు అని సూచిస్తున్నారు కొంతమంది నిపుణులు. వేతన జీవులు చాలామంది తమకు వచ్చిన జీతంతో ఏం చేయాలో ముందే ప్లాన్ వేసుకుంటారు. కాని జీతం ఖాతాలో జమ అయిన తర్వాత వారి ఆలోచనలు మారిపోతాయి. దీంతో చాలామంది వేతన జీవులకు వారికి వచ్చే జీతాలతో బతుకు బండిని ఈడ్చటం కష్టంగా మారుతోంది. కాని సింపుల్ టిప్స్ పాటిస్తే తప్పకుండా మనకు వచ్చే ఆదాయంలో ఎంతో కొంత పొదుపు చేసుకోవచ్చు.

కాలం మారుతున్న కొద్దీ ఖర్చులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ జీవితంలో ఎక్కువ మొత్తాన్ని నివాసం, తిండికి ఖర్చుపెడతారు. కాని ఇప్పుడు వీటితో సమానంగా వైద్యం, విద్యకు ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేటి పోటీ ప్రపంచంలో విద్య, వైద్యం చాలా ఖరీదైనవి మారాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు సైతం ఈపోటీ ప్రపంచంలో తమ సంపాదనలో ఎక్కువ భాగం విద్య, వైద్యానికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అనివార్యమైంది. మనకు వచ్చే వేతనంలో ఎంతో కొంత మొత్తాన్ని పొదుపు ఎలా చేయాలో తెలుసుకుందాం.

ఖచ్చితమైన అంచనా: ఓ మధ్య తరగతి వ్యక్తి నెల సంపాదన రూ.20,000 అనుకుంటే.. దానికి తగినట్లుగా ఖర్చులను అంచనా వేయాలి. వ్యక్తి తనకు వచ్చే ఆదాయాన్ని బట్టి తాను ఏ బడ్జెట్ ఇంట్లో ఉండాలో అంచనా వేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఇంటి అద్దె ఎక్కువ కావడంతో వచ్చిన సంపాదనలో సగభాగం దానికే వెచ్చించడం వల్ల ఆర్థికంగా వేతన జీవులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అందుకే సాదారణంగా తమకు వచ్చే వేతనాన్ని బట్టి అందులో అద్దె 20శాతానికి మించకుండా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఒక వేళ అద్దె గనుక 20 శాతం మించితే ఫైనాన్షియల్ గా బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. ఒకవేళ ఎవరికైనా అద్దె చెల్లించాల్సిన అవసరం లేకపోయినా సరే వేతనంలో 20 శాతం పక్కకు తీసి పెట్టుకుంటే భవిష్యత్తు అవసరాలకు అది ఉపయోగపడుతుంది. అలాగే పొదుపుగానూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కిరాణా, కూరగాయలు: మనం పెద్దింట్లో ఉంటున్నామా.. చిన్నింట్లో ఉంటున్నామా అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తిండిపై ఖర్చు పెట్టాల్సిందే. అంటే ప్రతి నెలా కిరాణా, కూరగాయలు వంటివి తప్పనిసరిగా కొనుగోలు చేయాలి. అందుకే తమ సంపాదనలో కిరాణా, కూరగాయల ఖర్చు 25 శాతానికి మించకుండా ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ పరిమితి మించితే మళ్లీ ఒకటో తేదీ వచ్చే వరకు మనం ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. మన సంపాదన ఆధారంగా మనం తినే కూరగాయలు మొదలైన వాటి ఎంపిక ఉండాలి. తక్కువ సంపాదన వచ్చే వారు వారంలో ఎక్కువ రోజులు నాన్ వెజ్ తినడం కోసం తమ ఆదాయాన్ని వెచ్చిస్తే ఎక్కువ శాతం మొత్తాన్ని తిండికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

పాలు, పెరుగు: ప్రతి ఇంట్లో పాలు, పెరుగు అనేవి ఇప్పుడు నిత్యవసరంగా మారాయి. టీ తాగే అలవాటు లేకపోయినా పిల్లల కోసమో లేదా పెరుగు కోసమో పాలును కొనాల్సిన పరిస్థితి. దీంతో తప్పనిసరిగా మన సంపాదనలో కొంత భాగాన్ని పాలు, పెరుగు కోసం కేటాయించాలి. అయితే ఈఖర్చు కుటుంబంలో సభ్యుల సంఖ్యను బట్టి ఆధారపడి ఉంటుంది. మన సంపాదన ఆధారంగా 5 శాతానికి మించకుండా ఈఖర్చు ఉండేలా చూసుకోవాలి.

స్కూల్ ఫీజులు: పిల్లల స్కూలు, కాలేజీ ఫీజులు ఇప్పుడు చాలా భారమవుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబానికి ఇవి ఓరకంగా భారమే. అయితే పిల్లల చదువులు తప్పనిసరి కాబట్టి కొంత మొత్తాన్ని దానికి వెచ్చించాలి. కొంతమందికి వివాహం అయిన తర్వాత కొన్నేళ్ల వరకు పిల్లల చదవు సమస్య ఉండకపోవచ్చు. కాని మొదటి నుంచే మనం నెలకు కొంత మొత్తాన్ని పిల్లల చదువుల కోసం తీసి ఉంచితే, భవిష్యత్తులో పిల్లల చదువులు మనకు భారం కావు. అందుకే కచ్చితంగా ఓ పది శాతం మొత్తాన్ని పిల్లల చదవు నిమిత్తం మన నెల ఆదాయంలో తీసి పక్కన పెట్టుకోవడం మంచిది.

సేవింగ్స్: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సేవింగ్స్ పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం LIC, పోస్టాఫీసు పథకాలు వంటివి కట్టడం అలవాటు చేసుకుంటున్నారు. కొంతమంది ప్రోపర్ ప్లాన్ లేకపోవడంతో ప్రారంభంలో ఈపథకాలు సరిగ్గా కట్టినా, కొన్నాళ్ల తర్వాత ఈపథకాలు కట్టడం ఆపేస్తున్నారు. అలాగే అప్పటివరకు కట్టిన అమౌంట్ ను వదిలేసుకుంటున్నారు. తమకుండే ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఇలా చేస్తున్నారు. అయితే తమకు వచ్చే ఆదాయంలో తప్పనిసరిగా ఓ 10 శాతాన్ని ఇలాంటి సేవింగ్స్ కోసం తీసి పక్కన పెట్టుకోవాల. ఇవే మన భవిష్యత్తుకు ఆధారంగా భావించాలి. అయితే ఈపథకాలను ఎంచుకునేటప్పుడు నెలకు ఎంత కట్టాలి అనేది కూడా డిసైట్ చేసుకోవాలి. మన స్థోమత ఆధారంగా ఈసేవింగ్స్ స్కీమ్స్ ను ఎంచుకోవాలి.

రవాణా ఛార్జీలు: తమ నెల జీతంలో చాలామంది అన్ని అవసరాల కోసం కొంత కేటాయిస్తారు. కాని ప్రతి నెల ఆఫీసుకు వెళ్లడానికి లేదా ఇతర ప్రయాణాలకు సంబంధించి ఆలోచన చేయరు. దీనివల్ల ఉన్న మొత్తం ఖర్చ పెట్టేసిన తర్వాత తమకు ప్రయాణ ఛార్జీల కోసం కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే ముందుగానే మనం ఆఫీసుకు వెళ్లే దూరం, బస్సుపై వెళ్తామా, బండిపై వెళ్తామా అనేది నిర్ణయించుకుని దానికి అవసరమైనంత మొత్తాన్ని కేటాయించుకోవాలి. మన రవాణా ఛార్జీలు 10 శాతం మించకుండా చూసుకోవడం ఉత్తమం.

అత్యవరాలు, అనవసరాల కోసం : ప్రతి మనిషి అనవరంగా కొంత ఖర్చుపెట్టడం సహజం, అలాగే మధ్యలో అనుకోకుండా కొన్ని అత్యవసర ఖర్చులు వస్తుంటాయి. అనుకోకుండా బండి రిపైర్ రావచ్చు. లేదా ఏదైనా అనుకోని ప్రమాదం జరగవచ్చు, అనారోగ్యం బారిన పడవచ్చు. అందుకే మన నెల ఆదాయంలో తప్పనిసరిగా ఓ 5 శాతం అనవసర ఖర్చుల కోసం, మరో 5 శాతం అత్యవసరాల కోసం తీసి ఉంచుకోవడం మంచిది.

తప్పనిసరి పొదుపు: ప్రతి వ్యక్తి జీవితంలో పొదుపు అనేది చాలా ముఖ్యం. ఈపొదుపు భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుంది. అందుకే మన నెల ఆదాయంలో 10 శాతం పొదుపు చేయడం ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..