Shocking Video: పిల్లల్ని ఆటోలో స్కూల్‌కు పంపుతున్నారా? ఇలాంటి డ్రైవర్లతో తస్మాత్ జాగ్రత్త.. !

ఈ వీడియో నెటిజన్లను సైతం ఆగ్రహం తెప్పించింది. 'ఇంత బాధ్యత లేని డ్రైవర్‌తో తమ పిల్లలను ఎలా పంపిస్తారు?' అంటూ కామెంట్‌ చేశారు. పోస్ట్‌ను గమనించిన

Shocking Video: పిల్లల్ని ఆటోలో స్కూల్‌కు పంపుతున్నారా? ఇలాంటి డ్రైవర్లతో తస్మాత్ జాగ్రత్త.. !
Autorickshaw
Follow us

|

Updated on: Aug 29, 2022 | 8:25 PM

Viral Video: ఆటోరిక్షాల్లో ఎక్కువ మందిని కూర్చోబెట్టడం చట్టవిరుద్ధం..పైగా నేరం కూడా..అలా ఎక్కించుకున్న వారికి జరిమానాలు తప్పవు. వాహనంలో ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకోవడం ముఖ్యంగా అతి ప్రమాదకరం. అయితే, సోషల్ మీడియాలో ఆటోరిక్షాలు కిక్కిరిసిపోతున్న వీడియోలను మీరు చాలా చూసే ఉంటారు. అయితే ఈ వీడియో ఎంత ప్రమాదకరమైనదో చూడండి.ఆటో రిక్షాలో ప్రమాదకరంగా స్కూల్‌ విద్యార్థులను ఎక్కించుకుని తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ట్విటర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో అందరినీ షాక్‌కి గురిచేస్తోంది.

సోషల్మ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూసిన పోలీసులు సదరు ఆటో డ్రైవర్‌పై చర్యలు తీసుకున్నారు. ఈ వీడియోని ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో చిత్రీకరించినట్టుగా తెలిసింది. ఈ డ్రైవర్ స్కూల్ పిల్లలను ఆటోలో తీసుకెళ్తున్నాడు. ఈ ఆటో శుక్రవారం ఆర్టీఓ కార్యాలయం, నకాటియా పోలీస్ ఔట్‌పోస్టు దాటిపోయింది. వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆటోలో విద్యార్థులు అంత భయంకరంగా ప్రయాణిస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిద్రపోతున్నారా’ అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో నెటిజన్లను సైతం ఆగ్రహం తెప్పించింది. ‘ఇంత బాధ్యత లేని డ్రైవర్‌తో తమ పిల్లలను ఎలా పంపిస్తారు?’ అంటూ కామెంట్‌ చేశారు. పోస్ట్‌ను గమనించిన బరేలీ పోలీసులు ఆటో డ్రైవర్‌కు జరిమానా విధించారు. నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి