September Holidays: సెప్టెంబర్ నెలలో మీరు టూర్‌కు ప్లాన్ చేస్తున్నారా..? వరుస సెలవులు ఎలా ఉన్నాయంటే..
September Holidays: ప్రతి నెల ప్రభుత్వ సెలవులు ఉంటాయి. పాఠశాలలు గానీ, బ్యాంకులు గానీ మూసి ఉంటాయి. అలాగే కొందరు ఉద్యోగులు సెలవు దినాల్లో వివిధ పర్యటక..
September Holidays: ప్రతి నెల ప్రభుత్వ సెలవులు ఉంటాయి. పాఠశాలలు గానీ, బ్యాంకులు గానీ మూసి ఉంటాయి. అలాగే కొందరు ఉద్యోగులు సెలవు దినాల్లో వివిధ పర్యటక ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు. అలాంటి సమయంలో ముందస్తుగా ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకుంటే ముందస్తు ప్లాన్ చేసుకునేందుకు వీలుంటుంది. అయితే ఈ సెలవులు రాష్ట్రాలు బట్టి ఉంటాయి. ముఖ్యమైన సెలవు దినాలు అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే తేడాలు ఉండవచ్చు. అలాగే పాఠశాలలు కూడా అన్ని దినాల్లో మూసి ఉండకపోవచ్చు. ఇక బ్యాంకుల విషయానికొస్తే వచ్చే నెలలో ఆదివారాలు, రెండో శనివారాలు కలుపుకొని మొత్తం 14 రోజులు సెలవులు రానున్నాయి. ఆ రోజుల్లో బ్యాంకులు కూడా మూత పడనున్నాయి. ఇంకో విషయం ఏంటంటే రాష్ట్రాల బట్టి సెలవులు ఉండనున్నాయి. సెప్టెంబర్ నెలలో మొత్తం 8 రోజులు సెలవులు ఉన్నాయి. ఇవి కాకుండా శని, ఆదివారాలు కలిపి 6 రోజులున్నాయి. అంతే మొత్తం 14 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల బ్యాంకు ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు టూర్ కు ప్లాన్ చేసుకోవచ్చు.
ముఖ్యంగా సెప్టెంబర్ 1వ తేదీన గోవాలో వినాయక చవితి, సెప్టెంబర్ 6న జార్ఖండ్‌లో కర్మపూజ పేరుతో బ్యాంకులకు సెలవులు, అలాగే సెప్టెంబర్ 7,8 తేదీల్లో కేరళలో ఓనం పండగ, 9వ తేదీ సిక్కిం, గ్యాంగ్‌టక్‌లో ఇంద్రజాత సెలవుంది. 10వ తేదీన శ్రీ నరవణ గురు జయంతి సందర్బంగా కేరళలో బ్యాంకులకు సెలవు. సెప్టెంబర్ 21న కేరళలో శ్రీనారాయణ గురు సమాధి దినం, సెప్టెంబర్ 26న నవరాత్రి స్థాపన కారణంగా మణిపాల్, రాజస్థాన్‌లో బ్యాంకులకు సెలవు. సెప్టెంబర్ 24వ తేదీన నాలుగో శనివారం. ఇలా వివిధ రాష్ట్రాల్లో సెప్టెంబర్‌లో సెలవులు ఉండనున్నాయి. ఇవి ప్రభుత్వ సెలవులు కాబట్టి ఆయా రాష్ట్రాలను బట్టి సెలవులు ఉంటాయి. ఇందుకు అనుగుణంగా టూర్ వెళ్లేందుకు గానీ, బ్యాంకు పని నిమిత్తం గానీ పనులు చేసుకునేందుకు ప్లాన్ చేసుకోవచ్చు.
సెప్టెంబర్ నెలలో సెలవుల జాబితా
సెప్టెంబర్ 1 – గణేష్ చతుర్థి రెండో రోజు సెప్టెంబర్ 6- కర్మపూజ (రాంచీ) సెప్టెంబర్ 7 – మొదటి ఓనం (కొచ్చి, తిరువనంతపురం) సెప్టెంబర్ 8- తిరువోనం (కొచ్చి, తిరువనంతపురం) సెప్టెంబర్ 9- ఇంద్రజాత (గ్యాంగ్‌టక్) సెప్టెంబర్ 10 -శ్రీ నరవణ గురు జయంతి సెప్టెంబర్ 21- శ్రీ నారాయణ గురు సమాధి దినం (కొచ్చి) సెప్టెంబర్ 26- నవరాత్రి స్థాపన (అన్ని రాష్ట్రాల్లో ఉండదు)
వారాంతపు సెలవుల జాబితా
సెప్టెంబర్ 4- మొదటి ఆదివారం సెప్టెంబర్ 10- రెండో శనివారం సెప్టెంబర్ 11- మూడవ ఆదివారం సెప్టెంబర్ 18- మూడో ఆదివారం సెప్టెంబర్ 24- నాలుగవ శనివారం సెప్టెంబర్ 25- నాలుగవ ఆదివారం
(నోట్: ఈ సెలవులు బ్యాంకులకు, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తాయి. కానీ ఆయా రాష్ట్రాల బట్టి సెలవులు ఉన్నాయి. కొన్ని సెలవులు కొన్ని రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు తక్కువ వర్తించవచ్చు. ప్రభుత్వం ఆర్బీఐ విడుదల చేసిన సెలవులు జాబితా మాత్రమే మీకు అందించడం జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో ఈ సెలవులు ఉండవని గమనించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..