Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IKEA India: ఐకియా స్టోర్‌పై జాత్యహంకార ఆరోపణలు.. తీవ్రంగా స్పందించిన మంత్రి కేటీఆర్.. అసలేమైందంటే..?

హైదరాబాద్‌ నగరంలోని అంతర్జాతీయ ఫర్నిచర్ రిటైల్ కంపెనీ ఐకియా స్టోర్‌లో జాత్యహంకార (racism) వివక్ష ఎదుర్కొన్నట్లు ఓ వ్యక్తి ట్విట్ చేయడం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది.

IKEA India: ఐకియా స్టోర్‌పై జాత్యహంకార ఆరోపణలు.. తీవ్రంగా స్పందించిన మంత్రి కేటీఆర్.. అసలేమైందంటే..?
Hyderabad Ikea Store
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 29, 2022 | 3:58 PM

Minister KTR on Hyderabad IKEA store: హైదరాబాద్‌ నగరంలోని అంతర్జాతీయ ఫర్నిచర్ రిటైల్ కంపెనీ ఐకియా స్టోర్‌లో జాత్యహంకార (racism) వివక్ష ఎదుర్కొన్నట్లు ఓ వ్యక్తి ట్విట్ చేయడం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. తన భార్యపట్ల ఐకియా స్టోర్ సిబ్బంది జాత్యాహంకారం ప్రదర్శించారంటూ ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పెద్ద సంఖ్యలో నెటిజన్లు ఐకియా‌ స్టోర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) స్పందించారు. ఈ చర్య భయంకరమైనది.. ఆమోదయోగ్యం కాదంటూ పేర్కొన్నారు. వారికి క్షమాపణ చెప్పడమే కాకుండా.. కస్టమర్లందరినీ గౌరవించేలా సిబ్బందికి అవగాహన కల్పించడం, శిక్షణ ఇవ్వాలంటూ సూచించారు. దీనిని త్వరగా చేస్తారని ఆశిస్తున్నానంటూ కేటీఆర్ ట్విట్‌లో పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే..

జర్నలిస్ట్ నితిన్ సేథీ హైదరాబాద్‌లోని ఐకియా స్టోర్‌లో జాత్యహంకార వివక్ష ఎదుర్కొన్నామంటూ.. సంస్థపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ గత రాత్రి ట్విట్ చేశారు. ‘‘మణిపూర్‌కు చెందిన నా భార్య మాత్రమే ఆమె కొనుగోలు చేసిన వస్తువులను పరీక్షించారు. మా ముందు ఎవరినీ తనిఖీ చేయలేదు. ఆపై జాత్యహంకారానికి మద్దతుగా సూపర్‌వైజర్ సిబ్బంది అంతా అక్కడికి వచ్చారు. ‘అంతర్జాతీయ స్టోర్’ గొప్ప ప్రదర్శన.. జాత్యహంకారం’’ అంటూ మండిపడ్డారు. నా భార్య షాపింగ్ బ్యాగ్‌లను తనిఖీ చేసిన వ్యక్తి, మేము అన్నీ కొనుగోలు చేశామని అవహేళనగా నవ్వాడు. అయితే మమ్మల్ని ఎందుకు ఒంటరిగా ఉంచారనే దానికి మాత్రం సరైన సమాధానం చెప్పలేదు. అసలు దానిని పట్టించుకోనేలేదు. సూపర్‌వైజర్లు.. మీకు కావాలంటే పోలీసులను పిలవండి. మేము మాట్లాడతామని అన్నారు. అది అక్కడే ముగియలేదు. మన ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ జాత్యహంకారం’’ అంటూ ట్విట్లు చేసి తెలిపారు.

కాగా.. ఈ వ్యవహారంపై ఐకియా ఇండియా స్పందించింది. తమ స్టోర్‌ల వద్ద సమానత్వం మానవ హక్కు అని తాము విశ్వసిస్తామని తెలిపింది. తాము అన్ని రకాల జాత్యహంకారం, పక్షపాతాలను ఖండిస్తున్నామని పేర్కొంది. తప్పనిసరి బిల్లింగ్ ప్రోటోకాల్‌ను అనుసరిస్తున్నప్పుడు వారికి కలిగిన అసౌకర్యానికి తాము చింతిస్తున్నామని పేర్కొంది. ‘‘స్వీయ-చెక్‌ అవుట్ చేసే కస్టమర్‌లు బిల్లింగ్ సరిగ్గా ఉందో లేదో నిర్ధారించుకోవడానికి స్టోర్ నుంచి బయలుదేరే ముందు తుది తనిఖీ కోసం అభ్యర్థిస్తారు. కస్టమర్‌లు రెండుసార్లు ఛార్జ్ చేయడం, ఉత్పత్తులను మళ్లీ మళ్లీ స్కానింగ్ చేయడం మొదలైన వాటికి సంబంధించి ఎలాంటి సమస్యలను ఎదుర్కోరు’’ అంటూ ఐకియా ఇండియా తెలిపింది.

ఐకియా ఇండియా ప్రకటనపై కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. కంపెనీ మరింత బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందని చాలాసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నామంటూ విమర్శిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి